twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజైన వారంలోనే... 4వేల పైరసీ సీడీలు స్వాధీనం

    By Srikanya
    |

    చెన్నై : నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం చేసిన మెరుపు దాడుల్లో కొత్త సినిమాలకు సంబంధించిన 4వేల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 'జిగర్‌దండా' పైరసీ సీడీలు నగరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆ చిత్ర నిర్మాత మంగళవారం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

    ఈసినిమాతో పాటు గత శుక్రవారం విడుదలైన పలు కొత్త సినిమాల సీడీలు కూడా నగరంలో విరివిగా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ ఆదేశాల మేరకు సహాయ కమిషనర్‌ ఎస్‌.జయకుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందాలు.. నగరంలోని బర్మాబజార్‌, రతన్‌బజార్‌, చైనా బజార్‌, నేతాజి బజార్‌లతోపాటు శివారు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో తనిఖీ చేశాయి.

    ఈ తనిఖీల్లో 'జిగర్‌దండా', 'వేలైఇల్లా పట్టదారి', 'సైవం', 'అరిమానంబి', 'చదురంగవేట్త్టె', 'తిరుమనం ఎనుం నిక్కా'లతో ఇతర సినిమాలకు చెందిన 4వేల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 24 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ముత్తు (22), సాహుల్‌ అమీద్‌ (22), మునిపాండి (48), శంకర్‌ (22), అబ్దుల్‌ (30), రమేష్‌ (31), అబ్దుల్‌ మజీజ్‌ (35)లను పోలీసులు అరెస్టు చేశారు.

    Piracy hits Jigarthanda, Police in action!

    'పిజ్జా' వంటి పెద్ద హిట్‌ చిత్రాన్ని అందించిన కార్తిక్‌సుబ్బురాజ్‌ దీనికి దర్శకత్వం వహించటంతో అక్కడ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు లక్ష్మీమీనన్‌ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటంతో కూడా ఓపినింగ్స్ అద్బుతంగా వచ్చాయి. అయితే తెలుగులో చిక్కడు దొరకడు టైటిల్తో డబ్బింగ్ చేసి ఇప్పటికే ట్రైలర్‌, పాటలు విడుదల చేసారు. అయితే పెద్దగా ఇక్కడ మన యూత్ ని ఆకట్టుకోలోకపోయాయి. తమిళ వాసన ఎక్కువ ఉండటంతో ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిలీజ్ అయ్యాక సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆడే అవకాసం ఉందంటున్నారు.

    ఇప్పుడు సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌, బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్‌ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

    ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    Jigarthanda starring Siddharth, Lakshmi Menon and Bobby Simhaa came out on August 1 and has been collecting rave reviews and stellar collections at the box office but a dark cloud has fallen over the otherwise jubilant team behind the movie. We are talking about that scourge of the movie industry – piracy!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X