విశాల్ కి టీవీ ఛానెల్ టార్చర్
తన లేటెస్ట్ సినిమా పిస్తా ఓ ప్రక్క ప్లాఫ్ అయిందని భాధ పడుతూంటే..ఇది చాలదన్నట్లు ఓ తమిళ ఛానెల్ వారు ప్రత్యేకంగా ఈ సినిమా ఫ్లాఫే లక్ష్యంగా పోగ్రాములు చేస్తున్నారు. ఆ సినిమాలోని క్లిప్పింగ్ లు రిలీజ్ చేసినా వాటిని చూపకుండా కొందరు చేత ఇష్టాగోస్టిగా కూర్చోపెట్టి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తోంది. దీనికి కారణం డిస్ట్రిబ్యూషన్ సంస్ధ ఉన్న ఆ ఛానెల్ వారికి విశాల్ తన సినిమా రైట్స్ ఇవ్వకపోవటమేనని తెలిసింది. వాళ్ళడిగిన రేటుకు మూడు రెట్లు విశాల్ కోట్ చేయటంతో వారు వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత ఆ సినిమా ప్లాప్ కావటంతో పర్శనల్ గా తీసుకున్న వారు పగ తీర్చుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంతేగాక విశాల్ చేత దెబ్బతిన్న దర్శకుడుని పిలిచి ఇంటర్వూలో ఆ విషయాలు చెప్పించారు. ఇవన్నీ చాలవన్నట్లు ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి న్యాయం చేయాలంటూ డిమాండ్ పెట్టింది. దాంతో వారంతా తమకు కాంపన్స్షేషన్ ఇవ్వాలని లేకుంటే నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేస్తామని గొడవచేస్తున్నారు. అంతకు ముందు రిలీజైన సెల్యూట్ సినిమా బయ్యర్స్ ను కూడా పోగేసి వారిని డబ్బు వసూలు చేసుకోమని విశాల్ పైకి ఉసిగొల్పుతోంది. ఇలా ఆ లీడింగ్ ఛానెల్ తానేంటే ఈ హీరోకి రుచి చూపుతోంది.


Click it and Unblock the Notifications











