అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్.. అసభ్యకరమైన సందేశాలు.. పిజ్జా బాయ్‌పై ఫిర్యాదు
తమిళ నటికి అనుకోకుండా ఓ షాక్ తగిలింది. ఆకలేస్తుంది కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే.. అది తలనొప్పిగా మారింది. వచ్చిన పిజ్జా బాయ్ చేసిన నిర్వాకంతో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇక భరించలేని ఆ నటి.. పోలీసులను ఆశ్రయించింది.. మిగతా వారు ఇలా మోసపోకండి.. జాగ్రత్త పడండి అని సలహాలు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందన్నది ఓ సారి చూద్దాం.

మణిరత్నం అంజలి..
మణిరత్నం అంజలి సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది గాయత్రీసాయి. ఆపై కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవేవీ అంతగా పేరును తీసుకురాలేకపోయాయి. గత రెండు రోజులుగా ఆమె పేరు వార్తల్లోకెక్కింది.

నంబర్ షేర్ చేసిన పిజ్జా బాయ్..
గాయత్రీ సాయి పిజ్జా ఆర్డర్ చేయడంతో వచ్చిన డెలివరీ బాయ్.. ఆమె నంబర్ అడిగాడు. ఆమె ఇవ్వడంతో అతను అశ్లీల గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో ఆమెకు తలనొప్పులు మొదలయ్యాయి. అసభ్యకర సందేశాలతో ఫోన్ మోత మోగిపోయిందట.

పోలీసులకు ఫిర్యాదు..
తన నంబర్‌ను ఇలా షేర్ చేశారు.. తనను అసభ్యకర సందేశాలతో వేధిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్‌మెంట్.. ఈ కేసును మహిళా విభాగానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.

దయచేసి క్లోజ్ చేయకండి..
స్పందించిన పోలీసులకు థ్యాంక్స్ చెబుతు.. డోమినోస్ పిజ్జా సంస్థకు కూడా కొన్నింటిని సూచించింది. ఇలాంటి విషయంలో, వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచడంలో బాధ్యత వహించండని, ఇలా మరొకరికి జరగకుండా చూడమని సలహా ఇచ్చింది.

కుష్బూను వేడుకుంది..
ఇక ఇదే విషయాన్ని నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్‌కు తెలిసేలా ట్వీట్ చేసింది. దయచేసి ఈ విషయంలో కలగజేసుకోండి.. సహాయం చేయండని కోరింది. ఇలా నంబర్ షేర్ చేయకుండా ఉండాలని, మీరు ఈ విషయంపై చర్యలు తీసుకునేలా ట్వీట్ చేయండని కోరింది.


Click it and Unblock the Notifications











