సూపర్ హిట్ డైరక్టర్‌తో సిద్ధార్ధ చిత్రం ఖరారు
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ... ''సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ యాక్షన్, డ్రామా సమ్మిళితంగా చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను'' అని తెలిపారు. ఫైవ్ స్టార్ మూవీస్ బ్యానర్‌పై ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం తన కెరీర్ లో మరో మలుపు అవుతుందని సిద్దార్ద చెప్తున్నారు. నిర్మాత కథిరేశన్ మాట్లాడుతూ... ''సిద్ధార్థ హీరోగా తమిళ, తెలుగుభాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే మెగా ప్రాజెక్టుకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తారు. చిత్రంలో ఇతర తారాగణం ఇంకా ఖరారు కాలేదు'' అని అన్నారు.
మరో ప్రక్క 'ఆడుగలం'తో జాతీయ అవార్డుల పంట పండించిన దర్శకుడు వెట్రిమారన్. ప్రస్తుతం నిర్మాతగా మారి సిద్దార్ద హీరోగా 'ఉదయం' రూపొందిస్తున్నాడు. 'ఎన్‌హెచ్ 4' అనేది ట్యాగ్ లైన్. 19న తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. సిద్ధార్థ్ 'ఉదయం' విషయానికి వస్తే... మణిమారన్ దర్శకుడు.అశ్రిత శెట్టి హీరోయిన్. రెడ్‌జైంట్ బ్యానరుపై ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతంలోని పాటలు కూడా ఇటీవలే విడుదలై ప్రజాదరణ పొందుతున్నాయి. చాక్లెట్‌బాయ్‌గా కనిపించే సిద్ధార్థ్ ఇందులో యాక్షన్‌హీరోగా నటించినట్లు సమాచారం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది వర్కవుట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












