నయనతార గురించి నన్ను అడగొద్దు..ప్రభుదేవా
తన భార్య కోర్టులో కేస్ ఫైల్ చేసిన దగ్గర్నుండీ ప్రభుదేవా మీడియాను కలవటానికి ఇష్టపడటం లేదు. అప్పటికీ ఎలాగో అలాగ షూటింగ్ స్పాట్ కి వెళ్ళి పట్టుకున్న మీడియాతో ఖచ్చితంగా నయనతార గురించి అడనంటేనే నోరు విప్పుతానంటున్నాడు. ఎందుకంటే ఏ కామెంట్ చేసినా దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు హెచ్చరించారని తెలుస్తోంది. ఇక ఎందుకుని మీరు ఇంటర్వూలు ఇవ్వటానికి, మీడియాని కలవటానికి భయపడతున్నారు అని అడిగిన దానికి ప్రభుదేవా సమాధానం చెపుతూ..కొన్ని ఛానెల్స్, పేపర్లు పనిగట్టుకుని మా పర్శనల్ లైఫ్ ని ఓ సీరియల్ లా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు నేను పనిచేసే సినిమా గురించి వివరాలు అడగండి..ఎంత సేపు కావాలంటే అంతసేపు..ఏ వివరం కావాలంటే దానిగురించి మాట్లాడతా అని అన్నారు.


Click it and Unblock the Notifications











