చీటింగ్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్, రంగంలోకి పోలీసులు?
తెలుగులో బిగ్ బాస్ మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందే తమిళంలోనూ ఈ రియాల్టీ షో 3వ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తెలుగుతో పోలిస్తే తమిళంలో వివాదాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
తమిళంలో కంటెస్టెంటుగా ఉన్న వనిత బిగ్ హౌస్‌లో ఎంటరైన తర్వాత కిడ్నాప్ కేసు నమోదు కావడంతో ఆమెను విచారించేందుకు తెలంగాణ పోలీసులు చెన్నై వెళ్లారు. స్థానిక పోలీసుల సహాయంతో బిగ్ బాస్ హౌస్‌లో ఆమెను కలిసి విచారించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా మరో కంటెస్టెంట్ విషయంలో కూడా పోలీసులు తమిళ బిగ్ బాస్ ఇంట్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

మీరా మిథున్‌పై చీటింగ్ కేసు
బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంటుగా ఉన్న నటి మీరా మిథున్‌పై చీటింగ్ కేసు నమోదైంది. రూ. 50 వేల విషయంలో మీరా తనను మోసం చేసినట్లు ఓ డిజైనర్ కేసు పెట్టారు. అంతే కాదు ఆమె మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు చేశారు.

మీరాను విచారించేందుకే...
ఈ కేసులో మీరాను విచారించేందుకు పోలీసులు బిగ్ బాస్ హౌస్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం షో నిర్వాహకుల నుంచి పర్మిషన్ తీసుకుంటున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.

మీరా మిథున్
మీరా మిథున్‌పై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. 2016లో మిస్ ఇండియా సౌత్ కిరీటం దక్కన్న ఆమె దాన్ని దుర్వినియగం చేయడంతో నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. మీరా 2017లో ‘8 తొట్టక్కాయ్' సినిమా ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ 3
కాగా....తెలుగులో నాగార్జున హెస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 3 జులై 21న మొదలైంది. ఈ షో నుంచి బయటకు వెళ్లే తొలి కంటెస్టెంట్ ఎవరు? అనేది జులై 28న ప్రసారం అయ్యే కార్యక్రమంలో వెల్లడికానుంది. ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఉన్నారు.


Click it and Unblock the Notifications











