ఆన్ లైన్ సెక్స్ రాకెట్ లో దొరికిన టీవీ ఆర్టిస్టు
కోయంబత్తూరు పోలీసులు ఓ ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ని ఛేదించారు. కొట్టయపాలెం అవుట్ స్కర్ట్స లో ఈ రాకెట్ బయిట పడింది. ఐదుగురు ఆడవాళ్లు ఇందులో దొరికారు. అందులో ఓ టీవీ ఆర్టిసు,సినిమాల్లో గ్రూప్ డాన్సర్ కూడా ఉన్నారు. పోలీసులు వీరిని మీడియాకు చూపెడుతూ..ఈ రాకెట్ ని కోవై బాలాజీ అలియాస్ ఎన్ బాలాజీ నడుపుతున్నాడు..అతనిపై రకరకాల కేసులు చెన్నైలో నమోదు అయ్యి ఉన్నాయన్నారు. ఇతని మీద గూండా యాక్ట్ క్రింద రెండు సార్లు కేసులు నమోదు అయ్యి ఉన్నాయి.
దిండిగల్ డిస్ట్రిక్ట్ నివాసి అయిన బాలాజీ ఈ టీవీ ఆర్టిస్టుని బేస్ చేసుకునే ఇంటర్నెట్,మొబైల్ ద్వారా ఈ సెక్స్ రాకెట్ ని గత కొంతకాలంగా నడుపుతున్నారని చెప్పారు. కోయింబత్తూరు దగ్గరలోని కోవై పాలెంలో ఇల్లు తీసుకుని తాను టెక్సటైల్ వ్యాపార్తుడునని చెప్పాడని ఇరుగు పొరుగువారు చెప్తున్నారు.అయితే ఈ టీవీ ఆర్టిస్టుని గుర్తు పట్టిన వారు ఆమె ఇక్కడకు తరచూ వచ్చి వెళ్ళటంతో అనుమానించి దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. వీరిలో లక్ష్మి అనే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆమె కూడా ఉంది. ఇక గ్రూప్ డాన్సర్,టీవీ ఆర్టిస్టు పాపులర్ ఫేసులు కావటంతో వారిని రివిల్ చేయలేదు. ఇక ఇలాంటివి సిటీలో బాగా ఎక్కువయ్యాయని సిటీ కమీషనర్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











