twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: జ్యోతిక పై పోలీస్ కేసు.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

    |

    తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కీర్తించబడుతూ పలు విజయవంతమైన సినిమాలు చేస్తున్న జ్యోతికపై పోలీస్ కేసు నమోదైంది. ఆమె నటించిన ఓ విషయంలో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. జ్యోతిక చేసిన క్యారెక్టర్ తమ మనోభావాలను దెబ్బ తీసిందంటూ కొందరు ఉపాధ్యాయులు చెన్నైలోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి పోతే..

    ప్రధానోపాధ్యాయురాలు.. జ్యోతిక

    ప్రధానోపాధ్యాయురాలు.. జ్యోతిక

    ఇటీవలే విడుదలైన రాక్షసి సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. జ్యోతిక చేసిన ఈ పాత్రకు మంచి స్పందనే వచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం తీవ్రంగా వ్యతిరేఖించారు. ఈ మేరకు వారంతా కలిసి చెన్నై పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    ప్రభుత్వ ఉపాధ్యాయుల అసమర్థత

    ప్రభుత్వ ఉపాధ్యాయుల అసమర్థత

    ప్రభుత్వ ఉపాధ్యాయుల అసమర్థతను, నిర్లక్ష్యాన్ని ఈ సినిమాలో ఎత్తి చూపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పాత్రలో నటించిన జ్యోతిక, ఇతర ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పకుండా సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు సిగరెట్లు, మందు తాగుతూ గొడవలు పడటం లాంటి సన్నివేశాలు చిత్రీకరించారు.

    అత్యధిక వేతనాలు తీసుకుంటూనే..

    అత్యధిక వేతనాలు తీసుకుంటూనే..

    ప్రభుత్వం నుంచి అత్యధిక వేతనాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు.. విద్యార్థుల భవిష్యత్, పాఠ్య పుస్తకాల భోదన లాంటి వాటిపై దృష్టి పెట్టకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని 'రాక్షసి' సినిమాలో చూపించడం జరిగింది.

    నిజాయితీ టీచర్లు.. పోలీస్ స్టేషన్‌లో

    నిజాయితీ టీచర్లు.. పోలీస్ స్టేషన్‌లో

    దీంతో రాక్షసి సినిమాలో కొన్ని సన్నివేశాలు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తీశాయని, అవి వారి కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే ఇళమారన్ చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో 'రాక్షసి' సినిమాను వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పలువురు ఉపాధ్యాయులు తమ మద్దతు తెలిపారు.

    రాక్షసి వెంటనే నిషేధించాలి

    రాక్షసి వెంటనే నిషేధించాలి

    తమను కించపరిచే విధంగా ఉన్న ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ కమీషనర్ కేసును పరిశీలనలో పెట్టారు. తదుపరి వివారాలు అందాల్సి ఉంది.

    English summary
    Police case filled on Jyothika at chenni police station. Teachers association demanding to ban the jyothika film Rakshasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X