twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్‌బుక్‌లో ఫోన్ నెంబర్.. ఊహించని పరిణామంతో యువ నటి షాక్.. పోలీస్ కేసు

    |

    ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సరికొత్త టెక్నాలజీ విస్తరిస్తున్న ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సెలబ్రిటీలు మొదలుకొని సాధారణ ప్రజల వరకు అంతా సోషల్ మీడియాలోనే గడిపే పరిస్థితులు వచ్చేశాయి. అయితే ఇదే సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో లేనిపోని చిక్కుల్లో పడేస్తుందని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చూసాం. తాజాగా ఓ తమిళ యువ నటికి ఇదే పరిణామం ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దామా..

    అందుబాటులో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్.. అంతా ఇష్టమే

    అందుబాటులో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్.. అంతా ఇష్టమే

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక, ప్రతీ వ్యక్తి సామాజిక మాధ్యమాలైన పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లలో తన సొంత ఖాతా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ ఖాతా ద్వారా తమకు ఇష్టమొచ్చిన పోస్టులు, ఫోటోలు, వార్తలు పోస్ట్ చేసుకునే అవకాశం ఉంది.

    సోషల్ మీడియా చిక్కులు.. సైబర్ క్రైం కేసులు

    సోషల్ మీడియా చిక్కులు.. సైబర్ క్రైం కేసులు

    అయితే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, కామెంట్లకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడితే సైబర్ క్రైం కేసులు తప్పవు. కానీ అవి తెలియక కొందరు చిక్కులో పడుతున్నారు. అంతేకాదు సైబర్ క్రైం కేసుల పాలవుతున్నారు.

    తమిళ యువ నటి.. సోషల్ మీడియాలో యాక్టివ్

    తమిళ యువ నటి.. సోషల్ మీడియాలో యాక్టివ్

    పాపులర్ టీవీ నటి మైనా నందిని ఇలాగే పోలీస్ కేసులో ఇరుక్కుపోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె సరవనన్ మీనాక్షి, కలక్క పోవత్తు యారు, కళ్యాణం ముదాల్ కాదల్ వారై వంటి తమిళ సీరియల్స్‌తో మంచి క్రేజ్ సంధించింది. తాజాగా ఆమెపై పోలీస్ కేసు నమోదైంది.

    ఫేస్‌బుక్ ఖాతాలో ఫోన్ నెంబర్..

    ఫేస్‌బుక్ ఖాతాలో ఫోన్ నెంబర్..

    ఇటీవలే నటి నందిని.. తన పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసి, అందులో ఓ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. అయితే ఇది ఆమె నెంబర్ కాదు. తన నంబర్‌కి బదులుగా ఈరోడ్ జిల్లా, అందియూర్‌ సమీపంలోని అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్‌ అనే వ్యక్తి ఫోన్ నెంబర్‌ను ఆ ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో ఇచ్చేసింది నందిని.

    క్షణం తీరిక లేకుండా ఫోన్లు.. పోలీస్ కేసు

    క్షణం తీరిక లేకుండా ఫోన్లు.. పోలీస్ కేసు

    దీంతో గురునాథన్‌ అనే వ్యక్తికి నందిని కావాలంటూ క్షణం తీరిక లేకుండా వరుసగా ఫోన్లు వస్తున్నాయి. అయితే చివరకు నటి మైనా నందిని ఆమె ఫేస్‌బుక్‌లో తన ఫోన్ నంబర్‌ని ఇచ్చిందని తెలుసుకున్న గురునాథన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెపై కేసు నమోదు చేశాడు.

    Recommended Video

    Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani | Filmibeat Telugu
    కావాలనే చేసిందా..? లేక..

    కావాలనే చేసిందా..? లేక..

    దీంతో నందిని.. తన వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్‌లో చేసిన తప్పుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నందిని కావాలనే ఈ తప్పుడు నెంబర్ పోస్ట్ చేసిందా? లేదా మిస్టేక్‌లో అలా జరిగిందా? అనేది తహ్లియాల్సి ఉంది.

    English summary
    Tv actress Myna Nandhini gave fake cell number in facebook account. On this issue police filled on Myna Nandhini. The investigation is going on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X