twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వీడియోపై పోలీసులు ఆగ్రహం.. సింగర్‌కు నోటీసులు.. డిలీట్ చేయమని ఆదేశం

    |

    తమిళ నాడు పోలీసుల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన షాపును ఎక్కువ సేపు తెరిచి ఉంచాడనే కారణంతో జయరాజ్ అనే వ్యక్తిని, అతని కొడుకు ఫినిక్స్‌ను పోలీసులు అతి దారుణంగా చంపారు. చిత్రహింసలు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు వారు చనిపోడంతో తమిళ సమాజమే కాకుండా యావత్ భారతదేశం ఈ ఘటనతో ఉలిక్కి పడింది.

    సోషల్ మీడియాలో వైరల్..

    సోషల్ మీడియాలో వైరల్..

    చనిపోయిన తండ్రీ కొడుకులకు న్యాయం చేయాలని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశం మొత్తం ఈ ఘటనపై స్పందించేలా ట్రెండ్ చేశారు. అందులో సింగర్ సుచిత్ర పాత్ర కూడా ఉంది. అందరూ తమిళంలోనే ట్వీట్ చేస్తుండగా.. అసలు సంగతి తెలియాలంటే ఆ ఘటన గురించి ఇంగ్లీష్‌లో అర్థమయ్యేలా వివరించాలని చెప్పుకొచ్చింది.

    సుచిత్ర వీడియో హల్చల్..

    సుచిత్ర వీడియో హల్చల్..

    దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితం అవుతున్నాయని, వారు ఇంగ్లీష్‌లో మాట్లడలేకపోవడమే అందుకు కారణమని సుచిత్ర చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఘటన గురించిన వివరాలను, పోలీసుల అకృత్యాలను తాను వివరించి చెబుతానని, ఈ విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చేయండని కోరింది.

    బట్టలు విప్పి..

    బట్టలు విప్పి..

    వారిద్దరి మోకాళ్లను, మోచేతులను విరగ్గొట్టారని, ఆపై వారి మొహాన్ని గోడకు కొట్టి పచ్చడి చేశారని తెలిపింది. థర్డ్ డిగ్రీలో భాగంగా వారి జననాంగాలలో కట్టలు, బాటిళ్లను దూర్చారని, రక్తం విపరీతంగా ప్రవహించిందని, వారిని అలాగే నగ్నంగా ఉంచారని పోలీసులు అకృత్యాలను వివరించింది.

    చక్కర్లు కొట్టిన వీడియో..

    చక్కర్లు కొట్టిన వీడియో..

    అలా సుచిత్ర షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో సుచిత్ర చెప్పినదానికి ఆధారాలు లేవని వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులంటే ద్వేషం కలిగించేలా ఆమె వీడియోను షేర్ చేసిందని పోలీస్ విభాగం తెలిపింది.

    డిలీట్ చేసిన సుచిత్ర..

    డిలీట్ చేసిన సుచిత్ర..

    అయితే తూత్తుకుడి పోలీసులు పంపిన నోటీసుల ప్రకారం సుచిత్ర ఆ వీడియోను డిలీట్ చేసింది. మొత్తానికి ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించగా.. ఈ కేసు సీబీ సీఐడీ చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై కోలీవుడ్ మొత్తం నోరు విప్పడం విశేషం.

    English summary
    Police Notice To Singer Suchitra On Jeyaraj And Fenix Case. Tamil Nadu CB-CID has instructed singer and radio jockey Suchitra to remove her video about the Sathankulam custodial deaths of Jayaraj and Bennix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X