టైం బ్యాడ్: హీరో ఇంటికి పోలీసు భద్రత...వార్నింగ్ లు

By Srikanya

చెన్నై: కొన్ని సంఘాల ముట్టడి హెచ్చరికతో నటుడు విజయ్‌ ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్‌ 'కత్తి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీలంకకు చెందిన వ్యక్తి నిర్మిస్తున్నట్లు ప్రచారం సాగింది. దీనిపై పలు తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనలో భాగంగా నీలాంకరైలోని విజయ్‌ ఇంటిని ఆదివారం ముట్టడించనున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్‌ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో యాభై మంది పోలీసులతో ఆయన ఇంటికి భద్రత కల్పించారు.

వివరాల్లోకి వెళితే... విజయ్ ఇంటిని కొన్ని తమిళ సంఘాలు ముట్టడించనున్నట్లు సమాచారంతో ఆయన నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. విజయ్ తాజాగా 'కత్తి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కత్తి చిత్రాన్ని శ్రీలంక తమిళుడు నిర్మిస్తున్నట్లు, అతడు నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ నటించడమా? అన్న చర్చ బయలుదేరింది. దీనిపై కొన్ని తమిళ సంఘాలు వ్యతిరేకత తెలిపాయి.

ఈ వివాదంపై తమిళ సంఘాలతో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చర్చలు కూడా జరిపారు. అయితే కత్తి చిత్రంలో విజయ్ నటించకూడదని ఈ సందర్భంగా తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే విజయ్ ఇంటిని ముట్టడించనున్నట్లు సమాచారంతో ముందు జాగ్రత్త చర్యగా అతని నివాసం ముందు సుమారు 50మందికి పైగా పోలీసులు మోహరించారు.

Police security to Vijay’s house

కత్తి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోందన్నారు. ఈ సంస్థ యజమాన్యానికి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహిత సంబంధాలున్నాయని కొన్ని తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా గతంలోనూ విజయ్ నటించిన 'తలైవా' చిత్రాన్ని కూడా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కత్తి చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

లికా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానున్నట్లు సమాచారం. మరోవైపు ఆడియో విడుదల కార్యక్రమాన్ని మదురైలో అభిమానుల నడుమ భారీఎత్తున నిర్వహించేందుకు విజయ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X