twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మురుగదాస్ అరెస్ట్ అంటూ బ్రేకింగ్.. కమల్, రజని ట్వీట్.. సందిగ్ధంలో విజయ్ సర్కార్!

    |

    దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ చిత్రం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అధికార పార్టీ అన్నా డీఎంకే నుంచి ఈ చిత్రానికి, చిత్ర యూనిట్ కు ముప్పు పొంచి ఉందనే స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దొంగ ఓట్లు అనే పొలిటికల్ కాన్సెప్ట్ తో మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. కానీ ఈ చిత్రంలో అధికార పార్టీ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేసారంటూ ఆ పార్టీ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పలు కేసులు నమోదు కాగా దర్శకుడు మురుగదాస్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందంటూ సంకేతాలు కనిపిస్తున్నాయి.

    సర్కార్‌కు ఎదురుదెబ్బ.. మురుగదాస్‌పై కేసు..సర్కార్‌కు ఎదురుదెబ్బ.. మురుగదాస్‌పై కేసు..

    సన్ పిక్చర్స్ బ్రేకింగ్ న్యూస్

    గత రాత్రి సన్ పిక్చర్స్ సంస్థ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ.. మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు అని సన్ పిక్చర్స్ సంస్థ ట్వీట్ చేసింది. దీనితో ఒక్కసారిగా తమిళ సినీవర్గాల్లో కలకలం మొదలైంది. అసలేం జరుగుతోందంటూ అంతా ఆరా తీయడం ప్రారంభించారు.

    స్పందించిన మురుగదాస్

    ఈ ఘటనపై దర్శకుడు మురుగదాస్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. గత అర్థ రాత్రి మా ఇంటికి పోలీసులు వచ్చారు. పలు మార్లు మా ఇంటి డోర్ కొట్టారు. కానీ నేను ఇంట్లో లేనని తెలుసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం మా ఇంటిముందు ఎలాంటి పోలీస్ బందోబస్తు లేదు అని మురుగదాస్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

    విరుచుకుపడుతున్న సెలెబ్రిటీలు

    విరుచుకుపడుతున్న సెలెబ్రిటీలు

    మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లారని వార్త తెలియగానే సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ హీరో విశాల్ ప్రభుత్వ చర్యలని ఖండించారు. చిత్రం ఒకసారి సెన్సార్ అయ్యాక దానిని అడ్డుకోవడం చట్ట విరుద్ధం. ఈ చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ రజని ట్వీట్ చేశారు.

    అవసరం ఏముంది

    హీరో విశాల్ స్పందిస్తూ.. మురుగదాస్ ఇంటికి పోలీసులు వెళ్ళారా..అసలెందుకు.. సర్కార్ చిత్రాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది. సెన్సార్ సభ్యుల అనుమతితోనే ఈ చిత్రాన్ని ప్రదరిస్తున్నారు. సెన్సార్ వారు అనుమతి ఇచ్చారంటే ప్రజలందరూ ఆ చిత్రాన్ని చూడవచ్చు అని అర్థం అంటూ విశాల్ ఘాటుగా స్పందించాడు.

    వీళ్లకు ఇదేం కొత్త కాదు

    వీళ్లకు ఇదేం కొత్త కాదు

    కమల్ హాసన్ కూడా తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగానే విరుచుకుపడ్డారు. సెన్సార్ అనుమతి పొందిన చిత్రాన్ని అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి కొత్తేమి కాదు. ఇది వీళ్లకు అలవాటే. కమర్షియల్ రాజకీయ నాయకులు త్వరలోనే అంతం అవుతారు. మంచి వారు ఎన్నుకోబడుతారు అంటూ కమల్ హాసన్ సోషల్ మీడియాలో స్పందించారు.

    Recommended Video

    #Sarkar : Mahesh Babu Tweets On Vijay Sarkar movie
     సన్నివేశాలు తొలగించాలి

    సన్నివేశాలు తొలగించాలి

    సర్కార్ చిత్రంలో అన్నా డీఎంకే ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న సన్నివేశాలు, జయలలితని తప్పుగా చూపించే విధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని అధికార పార్టీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ చిత్రం రోజు రోజుకు తీవ్రమైన వివాదంగా మారుతోంది.

    English summary
    Police visits AR Murugadoss' residence over Sarkar row. Actor Vishal comes out in directors' support
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X