ప్రముఖ విలన్ పరిస్థితి విషమం, హాస్పిటల్‌లో సెల్ఫీ వీడియో వైరల్.. కమల్ ఆర్థిక సహాయం
ప్రముఖ నటుడు, విలన్ పొన్నాంబళం ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో తమిళ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దాంతో ఆయనను ఆదుకోనేందుకు విలక్షణ నటుడు కమల్ హాసన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు, వైద్యం చేయించడానికి సిద్ధపడ్డారు. పొన్నాంబళం ఆరోగ్యం పరిస్థితి, ఇతర వివరాల గురించి మరింత సమచారం...

స్టంట్‌మాస్టర్‌గా.. విలన్‌గా
గత రెండు దశాబ్దాల కాలంలో నటుడు పొన్నాంబళం రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విక్రమ్ లాంటి ప్రముఖ నటులతో నటించారు. వాస్తవానికి ఆయన స్టంట్ మ్యాన్‌గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నాట్టమై చిత్రంతో మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఆ తర్వాత రజనీతో ముత్తు, అరుణాచలం, అజిత్‌తో అమరకాలం, విక్రమ్‌తో సామి, కమల్ హాసన్‌తో అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్‌కు సన్నిహితంగా మారిపోయారు.

బిగ్‌బాస్, రాజకీయాల్లోకి ప్రవేశించి
కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పొన్నాంబళం పాల్గొన్నారు. ఆయన జయం రవి నటించిన కోమలి చిత్రంలో చివరిసారిగా నటించారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయం రంగంలో కూడా అడుగపెట్టారు. 2011లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంతగా గుర్తింపు పొందలేకపోయారు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో
అయితే పొన్నాంబళం కిడ్నీ సంబంధిత సమస్యలతో అనారోగ్యం బారిన పడటంతో సినిమాలకు దూరం అయ్యారు. దాంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా మారింది. ఈ విషయం తెలుసుకొన్న కమల్ హాసన్ ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో నిరంతరం మాట్లాడుతున్నారు. ఆయన వైద్యానికి కావాల్సిన అవసరాలను సమకూర్చుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను కమల్ అడిగి తెలుసుకొంటున్నారు.

కమల్ హాసన్ ఆర్థిక సహాయం
పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుసుకొన్న కమల్ హాసన్ స్వయంగా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ కండీషన్ గురించి తెలుసుకొన్నారు. అవసరమైన డబ్బును కూడా అందజేస్తున్నట్టు తెలిసింది. కొద్ది రోజుల క్రితం పొన్నాంబళం ఆర్థిక పరిస్థితిని తెలుసుకొన్న కమల్ హాసన్.. ఆయన పిల్లల విద్యకు అయ్యే ఖర్చును పెట్టడానికి ముందుకు వచ్చిన విషయం కూడా తెలిసిందే.
Recommended Video
హాస్పిటల్ వీడియో వైరల్
కాగా, పొన్నాంబళం ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన ఊపిరి పీల్చుకోవడానికి పడుతున్న అవస్థ పడుతున్నట్టు ఉన్న వీడియో ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది. ఆ విషయం వెలుగులోకి రాగానే సినీ ప్రముఖులందరూ స్పందించడం మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











