twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ponniyin Selvan: రికార్డు ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు.. మొత్తం ఎంతంటే?

    |

    ప్రముఖ తమిళ సీనియర్ దర్శకుడు మణిరత్నం మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లో ఒక హిస్టారికల్ సినిమాతో బిగ్ హిట్ అందుకోవడానికి రెడీ అయ్యారు. కొన్నేళ్లుగా ఆయనకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ ఈసారి రాబోయే పొన్నీయిన్ సెల్వన్ సినిమాపై అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తో పాటు చాలామంది సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

    తమిళుల చోళ రాజ్యం కథ ఆధారంగా ఈ సినిమాను మణిరత్నం ఒక విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ తో మణిరత్నం కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో హక్కులు ఇటీవలే భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆడియో కంపెనీ టిప్స్ మ్యూజిక్ వాళ్ళు ఏకంగా రూ.24 కోట్లకు పొన్నీయిన్ సెల్వన్ ఆడియో హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    Ponniyin Selvan audio rights went to TIPS for a record price of 24 crs

    పొన్నీయిన్ సెల్వన్ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. ప్రముఖ తారలు అందరూ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో దేశవ్యాప్తంగా సినిమాకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరగనున్నట్లు సమాచారం. ఇక తమిళ్ హిందీ మలయాళం కన్నడ తెలుగు భాషల్లో స్పెషల్ గా సినిమాను ప్రమోట్ చేసి మరీ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ లో సినిమాకు మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాను మొత్తంగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. పొన్నీయిన్ సెల్వన్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Ponniyin Selvan audio rights went to TIPS for a record price of 24 crs
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X