For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాసేపట్లో విడుదలనగా పోన్నియన్ సెల్వన్ టీజర్ లీక్.. పసిగట్టే లోపే భారీ నష్టం!

  |

  క్లాసిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మణిరత్నం అని చెప్పక తప్పదు. గీతాంజలి చిత్రంతో తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయమైన మణిరత్నం ఇప్పటికీ ఆ క్రేజ్‌ కాపాడుకుంటూ వస్తున్నా ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఆయన చేసిన కడలి సినిమా ఫ్లాప్ కాగా, చెలియా సినిమా కూడా దాదాపు అదే ఫలితాన్ని చవి చూసింది. తర్వాత వచ్చిన నవాబ్ కాస్తో కూస్తో ఆడినా, హిట్ అని అనలేం. ఈ క్రమంలో ఆయన చేస్తున్న పోన్నియన్ సెల్వన్ మీద భారీ అంచనలు నెలకొన్నాయి. అయితే టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్న క్రమంలో లీక్ అవడం సంచలనంగా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  సెల్వన్ పార్ట్‌-1 టీజర్‌

  సెల్వన్ పార్ట్‌-1 టీజర్‌

  తమిళ్‌లోని పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, త్రిష, జయం రవి లాంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమా నుంచి ఒక్కో క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ పార్ట్‌-1 టీజర్‌ విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

   సెప్టెంబర్‌ 30వ తేదీన

  సెప్టెంబర్‌ 30వ తేదీన


  జులై 7న తంజావూరులోని బృహ‌దేశ్వ‌రా ఆలయంలో విడుద‌ల చేయ‌నున్నారని ముందు టాక్ వినిపించినా చివరికి చెన్నైలో లాంచ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. పొన్నియిన్ సెల్వన్తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదల కానుంది.

  టీజర్‌ను ప్లే చేస్తుండగా

  టీజర్‌ను ప్లే చేస్తుండగా

  ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచాలని సినిమా యూనిట్ భావిస్తోందట. అయితే పొన్నియన్ సెల్వన్ మేకర్స్ షాక్‌లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ చేయాల్సిన వారి సినిమా టీజర్ అధికారిక లాంచ్‌కు చాలా ముందే లీక్ అయింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో జరుగుతున్న టీజర్ రిలీజ్ ఫంక్షన్‌ను కవర్ చేస్తున్న ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేయడం ముగించినప్పుడు, చిత్ర బృందం వేదిక వద్ద పెద్ద స్క్రీన్‌పై టీజర్‌ను ప్లే చేస్తుండగా ఈ లీక్ జరిగింది. క్వాలిటీ చెక్ చేస్తున్న సమయంలోనే లీక్ అయిందని అంటున్నారు.

  షేర్ చేయడంతో

  షేర్ చేయడంతో

  ఈ లీక్ పొరపాటున జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తెలియరాలేదు. సదరు ఛానల్ తర్వాత యూట్యూబ్ నుండి వీడియోను డిలీట్ చేసింది. అయితే అయితే చాలా మంది నెటిజన్లు వీడియోను డౌన్‌లోడ్ చేయగలిగారు మరియు చాలా సోషల్ మీడియా పేజీలలో షేర్ చేయడంతో నష్టం జరిగింది. ఈ ట్రైలర్‌ను బహుళ భాషలలో లాంచ్ చేయాలని ప్లాన్ చేసి, ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి ఆయా బాషలలో అగ్ర ప్రముఖులను ఎంపిక చేసింది.

   2023 వేసవి నాటికి

  2023 వేసవి నాటికి


  సూర్య తమిళ వెర్షన్‌ను విడుదల చేయనుండగా, అమితాబ్ బచ్చన్ హిందీ, మహేష్ బాబు తెలుగు మరియు రక్షిత్ శెట్టి కన్నడ వెర్షన్‌లను విడుదల చేయనున్నారు. ఇక ముందే లీకైన క్రమంలో టీజర్ వీలైనంత త్వరగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సీక్వెల్‌ని 2023 వేసవి నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.

  English summary
  Mani Ratnam's ambitious project Ponniyin Selvan teaser was supposed to be launched in a grand manner at 6pm this evening, got leaked much ahead of its official launch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X