గుడ్డి బిచ్చగత్తెగా చేసినందుకు బాధపడటం లేదు
ఆమె తాజాగా 'విడియుం మున్' అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె మాట్లాడుతూ.. నాకు సంతృప్తినిచ్చే పాత్రలు లభించక కొద్దిరోజులు ఏ సినిమాలూ అంగీకరించలేదు. అంతేతప్ప నటనకు పూర్తిగా దూరమయ్యాననే వార్తల్లో వాస్తవం లేదు. 'విడియుంమున్' సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. చేతినిండా అవకాశాలు వస్తాయని నమ్మకం వ్యక్తం చేసింది.
బాలా దర్శకత్వంలో వచ్చిన 'నాన్ కడవుల్'లో అంధురాలైన భిక్షగత్తె పాత్రలో పూజ నటన అందరినీ అలరించింది. ప్రశంసలు లభించినా అమ్మడికి పెద్దగా అవకాశాలు రాకపోవటంతో కోలీవుడ్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ తమిళప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంతో తెలుగు తాను బిజీ అవుతానని నమ్ముతోంది.
ఇక ' నేనే దేముడ్ని ' చిత్రంలో చేయటం గొప్ప ఎక్సపీరియన్స్ అని చెప్తోంది. బాల వంటి దర్శకుడుతో పనిచేయటం అదృష్టమని,తానేమీ ఆ చిత్రంలో అలాంటి పాత్ర చేసినందుకు భాధ పడటం లేదని చెప్తోంది. తనకు ఆఫర్స్ రాకపోవటానికి కారణం..బిచ్చగత్తే పాత్ర చేయటమేనని చాలా మంది అనుకుంటున్నారని,అది నిజం కాదని అంది. అలాగే బాల తదపరి చిత్రం పరదేశి లో పాత్ర రానందుకు బాధపడుతున్నానని అంది.


Click it and Unblock the Notifications












