For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pooja Hegde ఆ హీరోపై బుట్ట బొమ్మ ఫిదా.. అతడిని మించిని వారు లేరంటూ!

  |

  సాధారణంగా సినీ పరిశ్రమలో ఏ హీరోతోనైనా పనిచేసిన తర్వాత హీరోయిన్లు కొన్నిసార్లు కంప్లయింట్లు చేయడం .. ఎక్కువసార్లు పొగడ్తలతో ముంచెత్తుతూ కనిపిస్తుంటుంది. మనసులో ఎలాంటి అసంతృప్తి ఉన్నా యూనిట్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ప్రెస్‌మీట్లో అలా చెప్పుకొంటూ పోవడం సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్‌పై పూజా హెగ్డే, ఆమె టీమ్ మెంబర్స్ మామూలుగా ప్రశంసించడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే..

  మరోసారి గ్లామర్ డోస్ పెంచిన మిర్జాపూర్ ఫేమ్ శ్వేతా త్రిపాఠి.. హాట్ స్టిల్స్

   చెన్నైలో బీస్ట్‌తో పూజా హెగ్డే బీజీగా

  చెన్నైలో బీస్ట్‌తో పూజా హెగ్డే బీజీగా

  ప్రస్తుతం పూజాహెగ్డే చెన్నైలో జరుగుతున్న బీస్ట్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. జానీ మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న సాంగ్ షూట్ కోసం వెళ్లి ఆమె కొన్ని రోజులు పాట కోసం రిహార్సల్ చేశారు. ఇటీవలనే ఆ సినిమా షూట్‌ను పూర్తి చేసుకొన్నారు. కొన్ని కారణాల వల్ల రెండు రోజులు షూట్ వాయిదా పడటంతో మరో రెండు రోజులు షూట్‌ను పొడిగించారు. ఈ వారాంతం వరకు షూట్ జరుగుతుందనే విషయం మీడియాకు పూజా హెగ్డే టీమ్ చెప్పారు.

  పూజా హెగ్డే కోసం విజయ్

  పూజా హెగ్డే కోసం విజయ్

  అయితే బీస్ట్ షూటింగులో విజయ్, చిత్ర నిర్మాతలు చూపించిన లవ్ అండ్ కేర్‌కు పూజాహెగ్డేనే కాకుండా సినిమా యూనిట్ కూడా ముచ్చటపడిపోయారట. షూటింగులో పూజా హెగ్డే కోసం విజయ్ తీసుకొన్న జాగ్రత్తలు, ఆమె యూనిట్‌ మొత్తానికి నిర్మాతలు స్టార్ హోటల్‌లో వసతి కేటాయించిన విధానానికి ముచ్చటపడి పోతున్నారు. విజయ్ ప్రవర్తన, ప్రతీ చిన్న యాక్టర్ గురించి తీసుకొనే శ్రద్దను చూసి పూజా హెగ్డే ఫ్లాట్ అయిపోయారట.

  విజయ్ అడుగుపెడితే సందడిగా

  విజయ్ అడుగుపెడితే సందడిగా

  సాధారణంగా స్టార్ హీరోలు సెట్లోకి వస్తే.. అక్కడి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయే సందర్భాల్లో ఎక్కువ కానీ, విజయ్ షూటింగులో అడుగు పెడితే సందడి సందడిగా ఉంటుందంట. సెట్లోకి అడుగుపెట్టగానే ప్రతీ ఒక్కరిని పలకరించడం విజయ్‌కి అలవాటు అనేది ఆయనతో పనిచేసే వాళ్లు చెప్పుకోవడం పలుమార్లు చెప్పుకొన్న సందర్భాలు ఉన్నాయి.

   విజయ్ రిసెప్షన్‌తో పూజా ఫిదా

  విజయ్ రిసెప్షన్‌తో పూజా ఫిదా

  అయితే పూజా హెగ్డే తన కెరీర్‌లో చాలా అరుదుగా ఓ హీరో నుంచి గొప్పగా రిసెప్షన్ అందుకొన్నారనే విషయం ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే టీమ్ మీడియాతో పంచుకొన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఒక హీరో గురించి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, ఆమె టీమ్ మెంబర్స్‌ చెప్పుకోవడం చూస్తే.. విజయ్ తన ప్రవర్తనతో పెద్ద మ్యాజిక్ చేశాడనే అనిపిస్తుంది.

   విజయ్ పక్క ప్రొఫెషనల్‌గా

  విజయ్ పక్క ప్రొఫెషనల్‌గా

  గతంలో సమంత లాంటి స్టార్ హీరోయిన్లు కూడా విజయ్‌పై ప్రశంసలు గుప్పించారు. పలు ఇంటర్వ్యూలో కొందరు హీరోయిన్లు కూడా సెట్లో విజయ్ పాటించే మర్యాదల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. సెట్లోకి అడుగుపెట్టగానే, ముఖానికి మేకప్ వేసుకోగానే విజయ్ పక్కా ప్రొఫెషనల్‌గా మారిపోతారు. ఆయన తప్ప ఆ పాత్రే కనిపిస్తుందనే విషయాన్ని పలు సందర్భాల్లో హీరోయిన్లు చెప్పడం అందరికి తెలిసిందే. ఏది ఏమైనా విజయ్ సానుకూలంగా యాటిట్యూబ్ ఉండటం తోటి నటీనటులుకు స్పూర్తి దాయకమనే చెప్పాలి అంటూ పూజా హెగ్డే టీమ్ చెప్పకనే చెబుతున్నది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  జనవరి 22న బీస్ట్ రిలీజ్‌

  జనవరి 22న బీస్ట్ రిలీజ్‌

  కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో జార్జియాలో షూటింగ్ జరుపుకొన్న బీస్ట్ చిత్రం తాజాగా ఆ ఉధృతి తగ్గగానే సినిమా షూట్‌ను ముగించే పనిలో ఉంది. జూలై 17 వరకు కొంత పార్ట్‌ను షూట్ చేసి.. ఆ తర్వాత జూలై చివరి వారంలో మరికొంత పార్ట్‌ను వడపళనిలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను 2022 జనవరి 22న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.

  English summary
  Pooja Hegde flats to Thalapathy Vijay attitude and behaviour in Beast shooting. Pooja and her staff gets good reception during the beast shoot. Now, They speaks out Vijay's dedication and honest towards movie and co artists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X