అగ్ర హీరో సినిమాలో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న పూజా హెగ్డే మొత్తానికి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. గతంలో తమిళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఆఫర్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో హిట్టయిన అనంతరం బుట్టబొమ్మ బ్రాండ్ మరింత పెరోగిపోయింది. దానికి తోడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచేసింది.
అయినప్పటికీ నాలుగు దిక్కుల నుంచి గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకున్న పూజ నెక్స్ట్ సల్మాన్ ఖాన్ సినిమాతో హిట్టు కొట్టాలని రేడి అవుతోంది. అయితే ఇప్పుడు సౌత్ లో అత్యధిక మార్కెట్ ఉన్న విజయ్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. విజయ్ 65వ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే.

సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఆ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే హీరోయిన్ విషయంలో గత రెండు నెలలుగా చర్చలు జరుపుతున్న చిత్ర యూనిట్ మొత్తానికి పూజా హెగ్డేను ఫైనల్ చేసింది. నెక్స్ట్ తెలుగులో రాధేశ్యామ్ తో హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్న బుట్టబొమ్మ విజయ్ తో మరో హిట్ కొడితే సౌత్ లో ఆమెకు తిరుగుండదు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. వచ్చే ఏడాది విజయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.



Click it and Unblock the Notifications











