కమల్‌ హాసన్‌తో సహజీవనం.. క్రేజీ హీరోయిన్ క్లారిటీ

విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న రూమర్లపై ఇండో అమెరికన్ నటి పూజా కుమార్ స్పందించారు. తనకు కమల్ హాసన్‌కు అఫైర్ ఉందని వస్తున్న వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూజా కుమార్ తనకు కమల్ హాసన్‌కు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. కమల్‌తో ఉన్న పరిచయంపై స్పందిస్తూ..

Recommended Video

Pooja Kumar Revealed The Relation With Kamal Haasan
కమల్ సార్‌తో రిలేషన్

కమల్ సార్‌తో రిలేషన్

కమల్ హాసన్ సార్‌ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయనతోనే కాకుండా వారి కుటుంబంతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచయితే కమల్‌తో కలిసి పనిచేస్తున్నానో అప్పటి నుంచి ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సోదరుడు, కూతుళ్లు శృతి, అక్షరతో కూడా నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పారు.

 మాకు ఏదో బంధాన్ని అంటగట్టేందుకు

మాకు ఏదో బంధాన్ని అంటగట్టేందుకు

ఇక కమల్ హాసన్‌తో వరుసగా కలిసి నటిస్తుండటం వల్ల మా మధ్య అఫైర్లు, డేటింగ్ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల నేను వాళ్ల ఇంట్లో జరిగే ఫంక్షన్లకు వెళ్తుంటాను. అంత మాత్రాన నాకు, ఆయనకు మధ్య ఏదో జరుగుతుందనుకంటే తప్పు. మా మధ్య డేటింగ్ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్లే అంటూ పూజా కుమార్ వెల్లడించారు.

 కమల్‌తో మూడు చిత్రాల్లో

కమల్‌తో మూడు చిత్రాల్లో

పూజా కుమార్ విషయానికి వస్తే.. కమల్ హాసన్‌తో కలిసి మూడు చిత్రాల్లో నటించారు. విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2 చిత్రాల్లో కలిసి నటించారు. పూజాకు కమల్ హాసన్‌ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కమల్ ఇంట్లో జరిగిన వేడుకకు పూజా కుమార్ హాజరు కావడంతో వారి మధ్య ఏదో బంధం కొనసాగుతుందనే పుకార్లు షికారు చేశారు.

క్షత్రియ పుత్రుడులో నటించడం లేదు

క్షత్రియ పుత్రుడులో నటించడం లేదు

ఇక కమల్ హాసన్ తాజా చిత్రం క్షత్రియ పుత్రుడు 2లో నటిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. లేదు. నేను నటించడం లేదు. ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు కమల్ రాలేదు. భవిష్యత్‌లో వస్తే చెప్పలేను అని పూజా కుమార్ అన్నారు. ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా బిజీలో ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం తర్వాత క్షత్రియపుత్రుడు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇండియన్2 గురించి

ఇండియన్2 గురించి

ఇండియన్ 2 విషయానికి వస్తే.. భారీ బడ్జెట్, తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దా్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఇండియన్ 2ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X