తమిళంలోకి... సైతం 'దండుపాళ్యం'
చెన్నై: కన్నడ, తెలుగునాట ప్రేక్షకులను అలరించిన చిత్రం 'దండుపాళ్యం'. తమిళంలో 'కరిమేడు'గా వస్తోంది. 'కాంచన', 'అరుంధతి', 'కన్నా లడ్డు తిన్న ఆశయా' వంటి చిత్రాలను అందించిన రామనారాయణన్ తన శ్రీతేనాండాల్ ఫిలిమ్స్ బ్యానరుపై తమిళనాట విడుదల చేస్తున్నారు.
కర్ణాటకలోని దండుపాళ్యం ప్రాంతమది. అక్కడ పలు అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు చోటుచేసుకున్నాయి. ఇదంతా ఎందుకోసం? ఎవరు చేస్తున్నారు వంటి ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. నెలాఖరులో థియేటర్లలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రామనారాయణన్ పేర్కొన్నారు.
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ప్రజలకు ఈ సినిమా గుణపాఠంగా మారుతుంది. అవగాహన కూడా కల్పిస్తుంది. అర్జీన్ కెన్యా సంగీతం అందరి మనసులను హత్తుకుంటుంది. తమిళనాడులోనూ వసూళ్లవర్షం కురిపిస్తుంది. పూజాగాంధీ నటన ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు.
శ్రీనివాస్‌రాజు మాట్లాడుతూ.... ఈ కథ కోసం 3నెలలు..క్రిమినల్స్, పోలీసులతోనే తిరిగాను. గొంతు కోస్తే వచ్చే శబ్ధం వినిహత్యచేస్తాడొక డు! గర్భగుడిలో రేప్‌కి రెడీ...జ్వరం వచ్చిన బాలికనూ వదిలిపెట్టరు...గాడిద టెస్టికల్స్ లోంచి రక్తం తాగి పరిగెత్తే మృగాలు వారు..క్లూస్ టీమ్‌కి కూడా దొరకని ఎత్తుగడ ఈ దుర్మార్గులది. చివరికి తిరుమలేశునికే పంగనామం పెట్టి దొంగతనం చేశారు. 16సార్లు ఉరి తీయాలని తీర్పు వచ్చినా మార్పు లేని ఏకైక గ్యాంగ్ కథ ఇది. 6 ఏళ్లపాటు పోలీసులు జాడ కూడా పసిగట్టలేకపోయారు. చాలా నేరాలకు ఆధారమే దొరకలేదు. క్రైమ్ కథల్లో కొత్త ఏంటి? అని ప్రశ్నించుకుని మరీ ఈ కథను ఎంపిక చేసుకున్నా.ఒకే కుటంబానికి చెందిన 11మంది సభ్యుల ముఠా ఊరిమీద పడి దారుణాలు చేయడం నన్ను పురిగొల్పింది. సినిమాగా తీశాను అన్నారు.


Click it and Unblock the Notifications












