ప్రముఖ హీరోయిన్ కుమారుడు అరెస్ట్.. భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయి...
అలనాటి స్టార్ హీరోయిన్ జయచిత్ర కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్రేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ అరెస్ట్ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అరెస్ట్‌కు కారణాల్లోకి వెళితే...

తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్‌గా
తెలుగులో శోభన్ బాబు, ఏఎన్నాఆర్, కృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి టాప్ హీరోల పక్కన జయలలిత నటించారనే విషయం తెలిసిందే. తమిళ, తెలుగు సినీ రంగాల్లో టాప్ హీరోయిన్‌గా రాణించారు. అయితే ఆమె కుమారుడు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా నాన్నే ఎన్నుల్ ఇళ్లై చిత్రంలో నటించారు. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయారు.

అమ్రేష్ గణేష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా
హీరోగా రాణించకపోవడంతో ఆ తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. తమిళ చిత్రసీమలో శివ, భాస్కర్ ఓరు రాస్కెల్, చార్లీ చాప్లిన్ 2, పొట్టు, శత్రు లాంటి సినిమాలకు సంగీతం అందించారు. అయితే గుప్తు నిధులు, ఆ తరహా దందాను స్నేహితులతో చేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఆ క్రమంలోనే ఓ వ్యాపార వేత్తను మోసగించారనే ఆరోపణలు వచ్చాయి.

2.5 లక్షల కోట్లు విలువ ఆశచూపి
అయితే చెన్నైలో వ్యాపారవేత్త నేడుమారన్‌తో అమ్రేష్ గణేష్ కొంతకాలంగా స్నేహం చేస్తూ వస్తున్నారు. అరుదైన ఇరిడియం లోహంతో ఆలయ కలశం ఉందని, దాని విలువ 2.5 లక్షల కోట్లు ఉంటుందని ఆశచూపారు. ఆ తర్వాత నెడుమారన్ నుంచి ముందస్తుగా రూ.26.5 కోట్లు తీసుకొన్నారు. కెనడా సంస్థ టెస్టింగ్ చేసిందని ఆయనకు ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపించారు అని తమిళ మీడియా కథనాన్ని వెలువరించాయి.

పోలీసులకు ఫిర్యాదు.. అమ్రేష్ అరెస్ట్
అయితే అమ్రేష్ గణేష్ చెప్పిన విషయాలపై నమ్మకం కోల్పోవడంతో నెడుమారన్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా అమ్రేష్‌తోపాటు ఆయన స్నేహితులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని కస్టడీలోకి తీసుకొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ నటి కుమారుడు ఇలాంటి కుంభకోణంలో అరెస్ట్ కావడం తమిళ సినీ వర్గాలను షాక్ గురిచేసింది.


Click it and Unblock the Notifications











