twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ సినిమాపై శ్రీలంక వివాదం

    By Srikanya
    |

    అల్లరి నరేష్ తమిళంలో డైరక్ట్ గా 'పోరాలి"అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడా చిత్రం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.తను నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పోరాళిని దర్శక నిర్మాత, నటుడు శశికుమార్ శ్రీలంకలో విడుదల చేయబోనని ఆయన ప్రకటించి సంచలనం క్రియేట్ చేసారు. అలాగే భవిష్యత్తులో తన చిత్రాలేవీ అక్కడ విడుదల కావని స్పష్టం చేశారు. తన చిత్రాల ఎఫ్‌ఎంఎస్ (ఫారిన్ మేనేజ్‌మెంట్ స్కానింగ్ రైట్స్) హక్కులను విక్రయించనని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంతేగాక శశికుమార్ తమ చిత్రాలను నిషేధించడానికి వారెవరు? మేమే ఆ ప్రభుత్వాన్ని బ్యాన్ చేస్తాం అని పేర్కొన్నారు.

    ఇప్పుడు శశికుమార్‌కు మద్దతుగా కోలీవుడ్‌లోని మరి కొందరు గళం విప్పుతున్నారు. అడుగళం దర్శకుడు వెట్రిమారన్ శశికుమార్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇకపై తన చిత్రాలనూ శ్రీలంకలో విడుదల చేయబోనని తేల్చి చెప్పారు. 'శంభో శివ శంభో" వంటి పలు హిట్ చిత్రాల్ని తమిళంలో రూపొందించిన సముద్రఖని దర్శకత్వంలో అల్లరి నరేష్, శశికుమార్ హీరోలుగా తమిళంలో 'పోరాలి" చిత్రం రూపొందుతోంది.

    శ్రీలంక ప్రభుత్వం తమిళుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిపై కోలీవుడ్ సినీ పరిశ్రమ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే శ్రీలంకలో షూటింగ్‌లు జరపకూడదని ఆంక్షలు విధించుకున్న కోలీవుడ్ ఈ విధంగా మరో అడుగు ముందుకేస్తోంది. కోలీవుడ్ ఇంత తీవ్రంగా స్పందించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. తమిళ చిత్రాల విడుదలకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం రకరకాల షరతులతో ఇబ్బందులకు గురి చేస్తోంది. చిత్రాలను రీ సెన్సార్ చేయడం, తమకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలను తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోంది.

    ఇటీవల విడుదలైన సెవెంత్ సెన్స్ చిత్రం విషయంలోనూ శ్రీలంక ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. అన్ని షరతులను అంగీకరించిన తర్వాతే చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది.దీంతో విసిగిపోయిన తమిళ పరిశ్రమ ఇక శ్రీలంకలో తమిళ సినిమాల విడుదల నిలిపివేయాలని యోచిస్తోంది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టిగా వ్యవహరించాలనుకుంటోంది. శ్రీలంక వ్యతిరేక సన్నివేశాలున్న తమిళ చిత్రాలపై నిషేధం విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

    English summary
    Sasikumar has announced that he would ensure that his forthcoming film 'Poraali' would not hit the screens in Sri Lanka, by not selling its foreign management screening rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X