Vikram Movie: మైండ్ బ్లోయింగ్.. ఈసారి కమల్ హాసన్ హిట్ కొట్టడం పక్కా: సెన్సార్ రిపోర్ట్!

విశ్వనటుడు కమల్ హాసన్ ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తూ ఉండేవి. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలతో కాస్త బిజీగా మారిపోయిన అనంతరం సినిమాలో విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే కమల్ హాసన్ యాక్టింగ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు అనే చెప్పాలి. ప్రతి సినిమాలో కూడా తనలోని సరికొత్త నటుడిని బయట పెడుతూనే ఉన్నారు. కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా రచయితగా అనేక రకాలుగా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న కమల్ హాసన్ ఈసారి అంతకుమించి అనేలా ఆకట్టుకోవడానికి విక్రమ్ సినిమాతో సిద్ధమవుతున్నాడు.

మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాతో రాబోతున్న కమల్ హసన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనిపిస్తోంది. విక్రమ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన విడుదల చేయబోతున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సౌత్ టాలెంటెడ్ యాక్టర్స్ విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ కూడా నటించడం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

Positive reports on Kamal hasan Vikram movie

ఇక విక్రమ్ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి కూడా ఇప్పటికే పాజిటివ్ టాక్ రాగా ఓవర్సిస్ సెన్సార్ మెంబర్ ఉమైర్ సందు కూడా విక్రమ్ సినిమా అద్భుతంగా వచ్చినట్లు వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది అంటూ కమల్ హాసన్ మంచి సినిమాతో కంబ్యాక్ ఇచ్చారని ఇన్ సైడ్ రిపోర్ట్ ప్రకారం మైండ్ బ్లోయింగ్ అనేలా సినిమా ఉన్నట్లు పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని కూడా అతను నమ్మకంగా తెలియజేశాడు.

విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న విక్రమ్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా యాక్షన్ సన్నివేశాలతో పాటు డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు అని చెబుతున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. తెలుగులో విక్రమ్ సినిమాను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట మూవీస్ విడుదల చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X