ఒంగోలు హోటల్ అధినేత కంప్లైంట్...పవర్ స్టార్ అరెస్టు

పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. రంగనాథన్ తన వ్యాపార అభివృద్ధికి రుణాల కోసం పలువురిని సంప్రదించాడు. ఆ తరుణంలో ఆంధ్ర, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఏజెంట్లతో మాట్లాడాడు. వారు పవర్‌స్టార్ శ్రీనివాసన్ వద్దకు తీసుకెళ్లారు. రూ.50 లక్షలు కమీషన్ ఇస్తే రూ.20 కోట్లు ఇప్పిస్తానని శ్రీనివాసన్ చెప్పారు.
ఆయన డిమాండ్ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రంగనాథన్ రూ.50 లక్షలు ఇచ్చారు. చెప్పిన సమయానికి రుణం ఇప్పించకపోవడం మాత్రమే కాక తీసుకున్న కమీషన్ కూడా ఇవ్వలేదు. బాధితుడు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
కమిషనర్ ఆదేశాల మేరకు నేర విభాగ సహాయ కమిషనర్లు శివకుమార్, శ్రీధర్‌లతో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సాలిగ్రామం ప్రాంతంలో పవర్‌స్టార్‌ను నేర విభాగ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 420, 120(బి) విభాగాల్లో కేసులు నమోదు చేశారు.
అరెస్టయిన పవర్‌స్టార్‌ను కమిషనర్ కార్యాలయంలో ఉంచి విచారణ చేపట్టారు. అనంతరం ఎగ్మూరు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు పుళల్ జైలుకు తరలించారు. గతంలో తిరుచెంగోడుకు చెందిన పారిశ్రామిక వేత్త, మదురైకి చెందిన గణేశ్‌కుమార్‌లు కూడా పవర్‌స్టార్‌పై కేసులు వేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











