For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవర్ స్టార్ సరసన హాట్ నమిత ఎంపిక

  By Srikanya
  |
  హైదరాబాద్: పవర్ స్టార్ ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి నమిత ఓకే చేసింది. ఇంతకీ పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోకండి... తమిళ కమిడియన్ శ్రీనివాసన్. ఆయన తాజా చిత్రంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే పెరుగుతున్నాయి.

  మొన్న సంక్రాంతికి విడుదలైన 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో పవర్‌స్టార్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌ హాస్యనటుడిగా మంచిపేరు సంపాదించుకున్నాడు. దాంతో ఆయన వేరే వారి సినిమాలో ప్రత్యేక గీతంలో చిందులేశారు. పి.టి.సెల్వకుమార్‌ దర్శకత్వంలో వినయ్‌, లక్ష్మీరాయ్‌ జంటగా వస్తున్న తాజా చిత్రం 'ఒన్బదుల గురు'. ప్రేమ్‌జీ, సత్యన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన గీతంలో పవర్‌స్టార్‌ను నటింపజేశారు. ఇది సినిమాలో కీలకమైనదని దర్శకుడు చెబుతున్నాడు.

  పవర్‌స్టార్‌ రాకతో సెట్‌ హాస్య పందిరిగా మారిందని, దర్శకుడి సూచనలకు అనుగుణంగానే పవర్‌స్టార్‌ కూడా అడుగులేశాడట. యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇదిలా ఉండగా రెండురోజుల కిందట జరిగిన షూటింగ్‌లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఛేజింగ్‌ సన్నివేశంలో సత్యన్‌ బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నపాటి గాయమేనని ఒకట్రెండురోజుల్లో నయమైపోతుందని వైద్యులు చెప్పారు.

  తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కామెడీ హీరో శ్రీనివాసన్. ఆయన తాజాగా ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యారు. ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అరవై ఐదు లక్షలు రూపాయలు చీట్ చేసారని ఆయనపై అభియోగం. తమిళ పరిశ్రమలో యాభై సంవత్సరాలు దాటాక పీల్డులోకి వ్చచి నటిస్తున్న ఈయన ఇంతకుముందు హీరోయిన్స్ నిత్యామీనన్, ప్రియా ఆనంద్ లకు కోటి రూపాయలు ఆఫర్ చేసి తన ప్రక్కన చేయమన్నాడు. అయినా వారెవ్వరూ ముందుకు రాలేదు.

  ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ కి పోటీ ఎవరు...అంటే...నేనే పవర్ స్టార్ ని పోటీ అంటూ తేల్చి చెప్పాడు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్. తెరపై స్థిరపడ్డాక బిరుదులు దక్కించుకునేవారు కొందరైతే డా||శ్రీనివాసన్‌ మాత్రం అందుకు భిన్నం. ఆయన తెరంగేట్రమే'పవర్‌స్టార్‌' పేరుతో చేశాడు. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏ మాత్రం తటపటాయించని పవర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలతో దుమ్మురేపుతున్నాడు. రీసెంట్ గా ఓ తమిళ పత్రికలో ఇచ్చిన ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌కు పోటీ అంటే అది పవర్‌స్టారే అని బాంబు పేల్చాడు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేశాడు. ఎవరి సరసన నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తనదైన శైలిలోసమాధానం ఇచ్చాడు. అనుష్క, హన్సిక, సమంతలు కాదు.. ఐశ్వర్యరాయ్‌ తన సరిజోడీ అని తేల్చాడు.

  English summary
  After Kanna Laddu Thinna Aasaiya, Power Star has been getting some big offers in Kollywood. Well, it is not just offers to star in films but in advertisements as well. Yes, Power Star will be seen in a real estate ad sharing the screen space with Namitha. Simultaneously, the actor is very busy playing the comedian in various films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X