For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: పవర్‌ స్టార్‌, సంతానం కాంబినేషన్‌

    By Srikanya
    |

    చెన్నై: 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, సంతానం జోడీకి మంచిపేరు వచ్చింది. ఒకరిపై ఒకరు విసురుకునే చెణుకులు నవ్వుల పంట పండిస్తున్నాయి. ఇద్దరూ ఒకేతెరపై కనిపించే అవకాశాలు మరిన్ని వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వస్తున్న చిత్రం 'యా.. యా..'. 'తమిళ్‌పడం' శివని హీరోగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇదే చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

    దర్శకుడు రాజేష్‌ వద్ద పనిచేసిన రాజశేఖరన్‌ మెగాఫోన్‌ పట్టుకుంటున్నాడు. ఇందులో పవర్‌స్టార్‌ కోసం ప్రత్యేకపాత్ర సృష్టించారట దర్శకుడు. క్రికెట్‌ నేపథ్యంతో సాగే ప్రేమకథ ఇది. ఒక జట్టు ఉప సారథిగా శ్రీనివాసన్‌ కనిపించనున్నారు. మరింతమంది దర్శకులు వారి కోసం స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకుంటున్నారట. గౌండమణి, సెంథిల్‌ను గుర్తుకు తెస్తున్నారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

    రోజు రోజుకూ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. మాస్‌ మసాలా అయినా... కన్నీళ్లు పెట్టించే సెంటిమెంటైనా... భావోద్వేగాలు పలికించే కుటుంబ కథైనా ప్రత్యేక ట్రాక్‌గా కామెడీ జోప్పించే విధానానికి కాలం చెల్లుతోంది. అందుకు ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచే. ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ కాలంలో నగేష్‌.. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సమయంలో గౌండమణి, సెంథిల్‌... అజిత్‌, విజయ్‌ వచ్చాక వడివేలు, వివేక్‌... ప్రస్తుతం సంతానం తమిళ చిత్రాల్లో హాస్య జల్లులు కురిపిస్తున్నారు. కామెడీ కథలను ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో తమిళ సినిమా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడిలో పయనిస్తోంది. గత ఏడాదంతా కామెడీ చిత్రాలు కాసులు పండించగా, 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో కొత్త సంవత్సరం కూడా అదే దారిలో పయనిస్తోంది.

    English summary
    Kanna Ladoo Thinna Aasaiya!. We are not talking about the ad here. This is going to be the name of comedy actor Santhanam’s next movie. That’s not it, the interesting news is that he has signed this movie with power star Srinivasan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X