ఎదుగదలను ఓర్వలేకే అంటూ అక్కడి పవర్ స్టార్
చెన్నై : ఎదుగదలను గిట్టనివారే తనను పోలీసులకు పట్టించారని డా. శ్రీనివాసన్ ఆరోపిస్తున్నాడు. లతికా చిత్రం ద్వారా సంచలన నటుడిగా తెరంగేట్రం చేశాడాయన. మొదటి సినిమాతోనే తనకు తాను పవర్‌స్టార్ బిరుదుని పెట్టుకుని జనాల్ని అలరించాడు. ఆపై కూడా మరికొన్ని సినిమాలు చేశాడు. ఇదిలా ఉండగా ఓ మోసం కేసుకు సంబంధించి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. జామీనుపై విడుదలైన శ్రీనివాసన్ మాట్లాడుతూ.. వెండితెరపైకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఎంతో పేరు సంపాదించుకున్నా. ఇది చూసి చాలామందికి కన్నుకుట్టింది. అయినా నా కెరీర్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశాడు.
తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కామెడీ హీరో శ్రీనివాసన్. ఆయన తాజాగా ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యారు. ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అరవై ఐదు లక్షలు రూపాయలు చీట్ చేసారని ఆయనపై అభియోగం. తమిళ పరిశ్రమలో యాభై సంవత్సరాలు దాటాక పీల్డులోకి వ్చచి నటిస్తున్న ఈయన ఇంతకుముందు హీరోయిన్స్ నిత్యామీనన్, ప్రియా ఆనంద్ లకు కోటి రూపాయలు ఆఫర్ చేసి తన ప్రక్కన చేయమన్నాడు. అయినా వారెవ్వరూ ముందుకు రాలేదు.
ఛీటింగ్ కేసు వివరాల్లోకి వస్తే...యు.బి.ఎస్ ఇంటర్నేషనల్ అధినేత,వ్యాపార వేత్త అయిన జి.యు బాల సుబ్రమణియన్ ను మోసం చేసిన ఆరోపణలపై ఈ చెన్నై పవర్ స్టార్ ని శనివారం అరెస్టు చేసారు. తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి ఈ శ్రీనివాసన్ ని పది కోట్ల రూపాయలు సాయిం చేయాల్సిందిగా కోరాడు బాలసుబ్రణియన్. తనకు ఐదు శాతం సర్వీస్ చార్జ్ క్రింద మొదటే చెల్లించాలని అరవై ఆదు లక్షలు నొక్కేసాడు. ఆ కేసు నుంచే ఈ తమిళ పవర్ స్టార్ బయిటకు వచ్చాడు.


Click it and Unblock the Notifications











