విజయ్‌ చిత్రంలో పవర్‌స్టార్‌ కామెడీ

By Srikanya

చెన్నై : 'ఇలయ తలబది' విజయ్ హీరోగా చేస్తున్న చిత్రంలో పవర్‌స్టార్‌ డా||శ్రీనివాసన్‌ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. నేశన్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న 'జిల్లా'లో విజయ్‌ హీరో. ఆయనకు జంటగా కాజల్‌ అగర్వాల్‌ ఆడిపాడనుంది. కీలకపాత్రల్లో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, యువ నటుడు మహత్‌, కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడు. ఇందులో హాస్యానికీ పెద్దపీట వేయనున్నారట. ఈ బాధ్యతను సంచలన నటుడిగా పేరు పొందిన పవర్‌స్టార్‌కే అప్పగించారు. పవర్‌స్టార్‌తో కలిసి కోవై సరళ, విడివి గణేష్‌, పరోటా సూరి, తంబి రామయ్య నవ్వుల జల్లు కురిపించనున్నారు.

ఈ కొత్త చిత్రాన్ని మే మొదటి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఈ చిత్రం నిర్మిస్తోంది. మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో కాజల్ సైతం తమిళంలో పూర్తిగా సెటిలవుతాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది. 'గుమ్కీ' విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చనున్నాడు. నేశన్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూపర్‌గుడ్‌ ఫలింస్‌ కోసం విజయ్‌ తన పారితోషికాన్ని కొంచెం తగ్గించుకున్నాడని సమాచారం.

గత ఏడాది 'తుపాకి' ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం 'దైవతిరుమగళ్‌' ఫేమ్‌ విజయ్‌ దర్శకత్వంలో 'తలైవా'లో నటిస్తున్నాడు. కమల్‌ హాసన్‌ మద్దతుగా 'విశ్వరూపం' విడుదల వరకు చిత్రీకరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు విజయ్‌ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. తుపాకి చిత్రం కూల్ హిట్ అని.. వంద కోట్లు దాటినా తన మాస్ అభిమానులను అలరించాలంటే ఇలాంటి చిత్రాలను చేయాల్సిందే అంటున్నారు విజయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X