రజనీ ఇమేజ్ తో ప్రభాస్ ని..
తమిళనాట రజనీకాంత్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్స్ అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. గాయకుడు మనో ఈ చిత్రం తమిళ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. కుమారన్ ..రజనీ రసిగన్ టైటిల్ తో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందులో రజనీకాంత్ అభిమానిగా ప్రభాస్ కనిపించటం ఈ చిత్రానికి కలిసివచ్చే అంశం. అంతేగాక ఓ పాట కూడా రజనీకాంత్ ని కీర్తిస్తూ ఉండటంతో దాన్నే హైలెట్ చేస్తూ రజనీ అభిమానులను ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆగస్టు మెదటి వారంలో విడుదల అయ్యే ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుందని అంతా బావిస్తున్నారు. వీటికి తోడు త్రిషా హీరోయిన్ గా చేయటం ఆమెకు తమిళనాట మంచి క్రేజ్ ఉండటం కలిసివచ్చే అంశంగా చెప్తున్నారు.
More from Filmibeat
prabhas trisha bujjigaadu made in chennai kumaran rajinirasigan rajnikanth august రజనీకాంత్ పూరీ జగన్నాధ్ బుజ్జిగాడు మేడిన్ చెన్నై త్రిషా హీరోయిన్ గాయకుడు మనో


Click it and Unblock the Notifications











