హాట్ టాపిక్: శంకర్ దర్శకత్వంలో ప్రభాస్
మొన్నే త్రీ ఇడియట్స్ ని విజయ్ తో రీమేక్ చేసి తమిళంలో సూపర్ హిట్ కొట్టిన శంకర్ తన తదుపరి చిత్రానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి స్ధానం దొరకిందని తమిళ సినీ వర్గాల సమాచారం. ఆ చిత్రం వివరాలను వాళ్లు చెపుతూ.. ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఆ సంస్థ కమల్‌హాసన్‌తో 'తలైవాన్ ఇరుక్కిరాన్' అనే చిత్రం నిర్మించబోతోంది. ఈ సినిమాకి శంకర్ దర్శకుడని తమిళ సినీ వర్గాలు ఫిక్స్ చేసి చెప్తున్నాయి.
అంతేగాక ఈ కథను మూడు భాషల్లో తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారని, తమిళంలో కమల్, తెలుగులో ప్రభాస్, మలయాళంలో మోహన్‌లాల్ నటించే అవకాశాలున్నాయని వారి వాదన. అలాగే ఈ మూడు భాషల్లోనూ హీరోయిన్ గా కత్రినాకైఫ్ నే ఎంపిక చేసినట్లు చెప్పుతున్నారు. ఐదారు నెలల తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళతారని సమాచారం. ఇప్పుడిదే తెలుగు సినీ వర్గాల్లోనూ,తమిళ సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్.


Click it and Unblock the Notifications











