ప్రభుదేవా కెరీర్ లో గోల్డెన్ ఛాన్స్
నయనతారతో వివాహం సెట్ కాగానే ప్రభుదేవా లైఫ్ మలుపు తిరుగుతన్నట్లుంది. అతని ఫ్యాన్ అయిన రెమో డి సౌజా అతన్ని హీరోగా అనుకుని ఓ డాన్స్ సబ్జెక్టుని భారీ బడ్జెట్ తో నిర్మించటానికి ముందుకొచ్చాడని సమాచారం. యుటీవీ వారు ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారు. అదికూడాపూర్తి స్ధాయి త్రీడిలో అని చెప్తున్నారు.అంతేగాక హాలీవుడ్ పాప్ స్టార్స్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభుదేవా ఈ మేరకు స్క్రిప్టుని రెడీ చేయిస్తున్నాడు. అతను కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ నటుడు అక్షయ్జ కుమార్ హీరోగా తెలుగులో విజయవంతమైన విక్రమార్కుడు చిత్రం రీమేక్ లో బిజీగా ఉన్నాడు. రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవటానకి రెడీ అవుతోంది. రౌడీ రాధోడ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











