సైకో కిల్లర్ గా ప్రభుదేవా నట విశ్వరూపం.. భగీర టీజర్ వైరల్
ఇండియన్ మైకేల్ జాక్సన్స్ ప్రభుదేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క డ్యాన్సర్ గానే కాకుండా నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా నిర్మాతగా ఎంతగానో క్రేజ్ అందుకున్నాడు. ప్రభుదేవా ఎలాంటి సినిమా చేసినా కూడా వైవిధ్యంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సారి అంతకుమించి అనేలా తన నట విశ్వరూపాన్ని చూపించనున్నట్లు ఒక టీజర్ తో చెప్పేశాడు.
కోలీవుడ్ లో భగీర అనే సినిమా చేస్తున్న ప్రభుదేవా అందులో ఒక సైకో కిల్లర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తుంటే ప్రభుదేవా ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. కెరీర్ లో మొదటిసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న సైకో పాత్ర చేస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని భయానక సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది. రొమాంటిక్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి.

నిర్మాత A రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా టీజర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. కుదిరితే తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











