నయనతార నా ప్రాణం...మా పెళ్ళెప్పుడంటే: ప్రభుదేవా
నా దర్శకత్వంలో రూపొందతున్న 'ఇచ్' సినిమా పూర్తి కాగానే నయనతారను పెళ్లాడతాను..నయనతార నా కోసమే పుట్టింది అన్నారు ప్రభుదేవా. చాలా కాలంగా వీరిద్దరి మధ్యన జరుగుతున్న ప్రేమాటని మీడియాకి తొలిసారిగా వివరించారు ప్రభుదేవా. అలాగే...నయనతార ప్రపంచంలోనే ఒక అద్భుతం. ఏ ప్రియుడైనా ప్రియురాలితో నిత్యం కలసి ఉండాలని కోరుకుంటాడు. నేనూ అంతే. దురదృష్టవశాత్తు మేం బిజీ కావడంతో ఎక్కువ సేపు కలసి ఉండలేకపోతున్నాం అన్నారు. ఆమెను తాను పిచ్చిగా ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లాడతానని ప్రభుదేవా చెప్పిన విషయాన్ని తమిళ పత్రికలు సోమవారం పతాకశీర్షికలతో ప్రచురించాయి.
అలాగే ఆమె గురించి చెప్పిన మాటల్లో...నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె నా వెన్నంటి ఉండి, ధైర్యం నూరిపోసింది. ఎడారిలో ఉన్న నన్ను ఆహ్లాదకరమైన ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు నాకు విపరీతమైన కోపం. కానీ, నా కోపాన్ని చల్లార్చేసింది. ఇప్పుడు నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆమె వల్లనే సాధ్యమైంది. ఆమె ఓ అద్భుతం. ఆమెను విడిచిపెట్టలేను' అంటూ ప్రభుదేవా చెప్పుకొచ్చారు. ఇక విజయ్, నయనతార జంటగా నటించిన 'విల్లు సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది.


Click it and Unblock the Notifications











