ప్రభుదేవాకు నయనతార తల్లి తండ్రులు ఆ కండీషన్ పెట్టారు
తన కూతురు నయనతారని వివాహం చేసుకోవాలంటే తమ మతంలోకి మారాలంటూ నయనతార తల్లి తండ్రులు కండీషన్ పెట్టినట్లు తమిళ పత్రికలు వార్తలు ప్రచురించాయి. నయనతార ది రోమన్ క్యాధలిక్ క్రిష్టియన్ ఫ్యామిలీ. దాంతో ఆమె తల్లి తండ్రులు తన కూతురు వివాహం తమ కుటుంబానకి మచ్చ తెచ్చేదిగా ఉండకూడదని, బాప్తస్మం పుచ్చుకుంటే మేలని చెప్పారుట. నయనతార కూడా తమ కుటుంబ ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన భాధ్యత కాబోయే ఇంటి అల్లుడుపై తప్పనిసరిగా ఉంటుందని కాబట్టి మతం మార్చుకోమని చెప్తోందిట. ప్రభుదేవాని ఈ విషయమై మీడియావారు అడగ్గా నో కామెంట్ అని దాటవేసాడు. వీరి వివాహం ఆగస్టులో జరగనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నయనతార తెలుగులో బాపు దర్శకత్వంలో రూపొందుతోన్న రామరాజ్యంలో నటిస్తోంది. అందులో సీతగా కనిపించనుంది.రాముడుగా బాలకృష్ణ మురపించనున్నారు.


Click it and Unblock the Notifications











