ప్రభుదేవా దర్శకత్వంలో త్రిష చేస్తున్న...
త్రిష నటించిన తొలి హిందీ చిత్రం 'కట్టా మీఠా' ప్లాప్ అవటంతో ఆమె మళ్లీ సౌత్ సినిమాపై దృష్టి పెడుతోంది. తాజాగా ఆమె త్రిష తమిళంలో విశాల్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో బుక్కయింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ కాంబినేషన్ లో 'మన్మథన్ అంబు' చిత్రంలో నటిస్తోంది. అలాగే 'కట్టా మీఠా' గురించి చెబుతూ..ఇలాంటివన్నీ జీవితానికి మంచి పాఠాలుగా ఆమె భావిస్తును..అయినా 'కట్టా మీఠా'తో కెరీర్ ఆగిపోవడం లేదు కదా..తమిళ చిత్రం 'విన్నైత్తాండి వరువాయా' హిందీ రీమేక్ లో నటిస్తున్నాను కాబట్టి బాలీవుడ్ లో నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం మిగిలి ఉంది త్రిష ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో త్రిషకు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం వరించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











