45కోట్లు ముట్టజెప్పి రెండో పెళ్ళికి సిద్దమైన ప్రభు-నయన..!
ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సినీనటి నయనతార త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని, గతంలో వీళ్ల పెళ్ళి గురించి వచ్చిన పుకార్లను నిజం చేయబోతున్నారు. 'ప్రభుదేవా" మొదటి భార్య 'రమాలత్"ను ప్రభుదేవా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయినా ప్రభుదేవా, నయనతార ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివాన గా తయారయ్యి, విడరాని బంధం కావడంతో, 'రమాలత్" తట్టుకోలేక తన భర్త 'ప్రభుదేవా"ను విడాకులు కోడంతో, ప్రభుదేవా కూడా అందుకు అంగీకారం తెలిపాడు..
నయనతార కోసం ప్రభుదేవా 'రమాలత్"కు భారీ మూల్యాన్నే చెల్లించి విడాకులు తీసుకోబోతున్నాడని తెలిసింది. 45కోట్లు 'రమాలత్"కు ఇవ్వడానికి కోర్టులో ఒప్పుకున్నాడని తమిళ పత్రికలు మీడియా తెలిపింది. ప్రభుదేవా 'రమాలత్"కు పుట్టిన కొడుకు మరణించిన విషయంలో ప్రభుదేవాకు 'రమాలత్"కు వచ్చిన మనస్ఫర్థల కారణంగానే ప్రభుదేవా నయనతారను ప్రేమించాడని ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నాడని ఫిలింనగర్ న్యూస్.
నయనతార కూడా ప్రభుదేవాను పెళ్ళి చేసుకోమని తొందర పెట్టడంతో, ప్రభుదేవా 'రమాలత్" కోరిన 45కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు 'కోలీవుడ్" వర్గాలు చెప్పుకుంటున్నాయి. 'శ్రీరామ రాజ్యం"లో సీతగా నయనతార నటించిన తర్వాత ప్రభుదేవాను పెళ్ళి చేసుకోవాలనే తలంపుతో, ఏ సినిమాలోనూ నటించడానికి ఒప్పుకోవడం లేదని, అనేక ఆఫర్లు వచ్చిన త్రోసిపుచ్చిందని ఫిలింనగర్ న్యూస్. ఇది ఇలా ఉంటే ప్రభుదేవా, నయనతార పెళ్ళి జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నారు..


Click it and Unblock the Notifications











