»   » ఆ విషయంలో ఆయన చాలా స్సీడ్..గుడ్ జామ్ మిస్టర్ రోమియో...!?

ఆ విషయంలో ఆయన చాలా స్సీడ్..గుడ్ జామ్ మిస్టర్ రోమియో...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా తాజాగా తమిళంలో 'ఇచ్" అనే సినిమాని చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కళాపతి యస్ అగోరామ్ నిర్మాణంలో ఎజియస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం 'ఇచ్". అందులో 'జయం" రవి, హన్సిక మోత్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆస్ట్రేలియా..ప్యారిస్ లాంటి దేశాల్లోషూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కేవలం 46 రోజుల్లో పూర్తి చేసి ప్రభుదేవా రికార్డ్ సృష్టించాడని కోలీవుడ్ వర్గాల కథనం. ఇటీవల కాలంలో అంత వేగంగా షూటింగ్ పూర్తయిన తమిళ సినిమా అదేనని సినీ పండితుల ఉవాచ.

హయారీస్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ ఒక ఐటం సాంగ్ లో నటించిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ విషయాన్ని ఖండించడం కానీ, దృవీకరించడం కానీ ఇంతవరకు చేయలేదు. ఏదేమైనా మంచి స్పీడ్ లో ఈ సినిమాని పూర్తి చేసి నిర్మాతలందరి చేత శభాష్ అనిపించుకున్నాడు ప్రభుదేవా.

ఈ సినిమాలోని అందరు నటీనటుల సహకారంతోనే అనుకున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ సినిమాని పూర్తి చేయగలిగాను. ఈ విషయంలో నా టీమ్ మొత్తానికి కృతజ్ఝతలు తెలుపుకుంటున్నాను" అంటున్నాడు ప్రభుదేవా. గుడ్ జాజ్ మిస్టర్ రోమియో...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu