స్టార్, డైరక్టర్,డాన్స్ మాస్టర్, అయిన ప్రభుదేవా కుమారుడు ఈ రోజు(గురువారం) ఉదయం ఎర్లీ అవర్స్ లో మరణించాడు. బసవరాజ్ అనే పేరు గల అతన్ని ఇంట్లో విశాల్ అని ముద్దు పేరుతో పిలుచుకుంటారు. అతను చాలా కాలంగా కాన్సర్ తో భాధపడుతున్నాడు. అప్పటికీ పెద్ద పెద్ద వైద్యులు కు చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విషయమై ప్రభుదేవా స్పందిస్తూ...ఎప్పుడో ఒక రోజు ఇటువంటి సంఘటన ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసుకానీ,అయితే ఆ రోజు ఇంత ముందు వస్తుందని భావించలేమని అన్నారు. ఈ మధ్యన ఆయన తన కుమారుడుని విల్లు షూటింగ్ కి కూడా తీసుకెళ్ళాడు. ఇక ఈ సంఘటన తెలిసిన కోలివుడ్ అంతా ఆయన ఇంటికి తరలి వచ్చింది. చెన్నై బీసెంట్ నగర్ స్మసానంలో దహన సంస్కారాలు జరగనున్న విశాల్ మృతికి శ్రధ్ధాంజలి ఘటిస్తూ...ప్రభుదేవా ఈ విషాదం నుండి త్వరగా కోలుకోవాలని దట్స్ తెలుగు కోరుకుంటోంది.
Story first published: Thursday, December 4, 2008, 16:30 [IST]