నయనతార, ప్రభుదేవా కొత్త దంపతుల్లా...
నయనతార, ప్రభుదేవా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని..ప్రేమ నడుస్తోందని...త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఆమధ్య వాపించాయి. అవి కేవలం రూమర్స్ గా ఇద్దరూ కొట్టపారేశారు. అలాగే తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితుల ఒత్తిడి మేరకు ప్రభుదేవాకు దూరంగా ఉండాలని నయనతార నిర్ణయించుదంటూ వినిపించింది. అయితే అదేమీ నిజం కాదని ప్రభుదేవా, నయనతార మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతోందని క్రిందటి శుక్రవారం జరిగిన సంఘటన రుజువుచేస్తోంది. కాస్త లేటుగా బయిటకు వచ్చిన ఈ సంఘటన కేరళలో జరిగింది. ప్రముఖ మళయాళ దర్శకుడు సిద్దిఖ్ కూతురు సుమిత్ వివాహ రిసెప్షన్ కి నయనతార, ప్రభుదేవా ఇద్దరూ హాజరయ్యారు. జంటను ఆశ్వీరదించిన వీరిద్దరూ హఠాత్తుగా మాయమయ్యారు.
నయనతార నేటివ్ ప్లేస్ అక్కడే కావటంతో ఆమె తన పరిచయస్తుల వద్దకు వెళ్లిందనుకున్నారు. అయితే ఆ రాత్రి ప్రభుదేవా సెల్ కూడా కట్టేసి ఉండటం, మరుసటి రోజు ఇద్దరూ కొచ్చిన్ లో మరోసారి కనపడటం తో అంతా ఆ రాత్రి కలిసి ఉన్నారనే విషయం కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ఈ పంక్షన్ కి అటెండయిన ఓ ఆర్టిస్ ఈ విషయమై మాట్లాడుతూ....నేనెప్పుడూ ప్రభుదేవా, నయనతార ఇంత ఆనందంగా ఉండటం చూడలేదు. రిసెప్షన్ లో ఓ కొత్తగా పెళ్ళయిన జంటలా బిహేవ్ చేసారు. వారి మధ్య ఎంతో ప్రేమ ఉందని ఇట్టే చెప్పేయచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన 'విల్లు" షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.


Click it and Unblock the Notifications