ప్రభుదేవా, నయనతార వివాహం జరిగినట్లేనా?
ప్రభుదేవా, నయనతార తమ సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని కొన్ని తమిళ పత్రికలు తాజాగా కథనాలు ప్రచురించాయి. పూలదండలతో ఉన్న ఫొటో కొన్ని ఆంగ్ల, తమిళ, తెలుగు వెబ్ సైట్లలో ప్రముఖంగా దర్శనమిస్తోంది. ఈ ఫోటో వేసి వాటి క్రింద ఈ న్యూస్ వేసారు. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లేనని తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే ఇది వివాహ సమయంలో వారు దండలు మార్చుకున్న ఫొటోనా...లేక మార్ఫింగా అన్నది తేలాల్సి ఉందని కొందరంటున్నారు.
ప్రభుదేవా, నయనతార చాలాకాలంగా కలిసి సహ జీవనం చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. దానికి తగ్గట్లే ఆ మధ్య ప్రభుదేవా భార్య రమలత వారిద్దరూ తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మహిళా సంఘాలను ఆశ్రయించారు. అంతేగాక చెన్నైలో నయనతార కనిపిస్తే కొట్టేస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించారు. అప్పటి నుంచి నయనతార చెన్నైకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వెబ్ సైట్లలో ప్రత్యక్షమైన ఈ ఫొటో ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











