ప్రభుదేవాతో నయనతార పెళ్ళి?

'జెంటిల్ మన్' చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు. 'చికుబుకు రైలే' స్పెషల్ సాంగ్ లో అదరగొట్టారు. తర్వాత ప్రేమికుడు, మిస్టర్ రోమియో, మెరుపు కలలు వంటి చిత్రాల ద్వారా తన నట ప్రతిభ చాటుకున్నారు. 'నువ్వొస్తావంటే నేనొద్దంటానా' అంటూ దర్శకుడిగా మారారు. ఇక... నయనతార 'చంద్రముఖి' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
గజిని, లక్ష్మి, దుబాయ్ శీను, వల్లభ వంటి సినిమాల ద్వారా అందాల తారగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రభు-తారల పెళ్లి వార్త తెలుగు, తమిళ సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విలేఖరులు ప్రభుదేవాను సంప్రదించగా...'నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ వెల్లడించాల్సిన అవసరం లేదు' అని స్పందించారు. నయనతారతో తన పెళ్లి వార్తను మాత్రం ఆయన ఖండించలేదు.
nayantara prabhu deva chennai manager gentle man premikudu chandramukhi గజిని లక్ష్మి దుబాయ్ శీను చెన్నై ప్రభుదేవా నయనతార జెంటిల్ మన్


Click it and Unblock the Notifications