twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుదేవాతో నయనతార పెళ్ళి?

    By Staff
    |

    Nayantara
    చెన్నై: ప్రభుదేవా నయనతార పెళ్ళి చేసుకున్నారా? ఈ విషయాన్ని నయనతార మేనేజర్ అధికారికంగా ఖండించగా ప్రభుదేవా మాత్రం ఇది వ్యక్తిగత వ్యవహారమని దాటవేశారు. రెండు మూడు రోజుల క్రితమే వీరు పెళ్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుదేవాకు గతంలోనే ఓ వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులుండగా ఒకరు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుదేవా తొలుత నృత్య దర్శకుడిగా సినీరంగంలో అడుగుపెట్టారు.

    'జెంటిల్‌ మన్‌' చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు. 'చికుబుకు రైలే' స్పెషల్‌ సాంగ్‌ లో అదరగొట్టారు. తర్వాత ప్రేమికుడు, మిస్టర్‌ రోమియో, మెరుపు కలలు వంటి చిత్రాల ద్వారా తన నట ప్రతిభ చాటుకున్నారు. 'నువ్వొస్తావంటే నేనొద్దంటానా' అంటూ దర్శకుడిగా మారారు. ఇక... నయనతార 'చంద్రముఖి' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

    గజిని, లక్ష్మి, దుబాయ్‌ శీను, వల్లభ వంటి సినిమాల ద్వారా అందాల తారగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రభు-తారల పెళ్లి వార్త తెలుగు, తమిళ సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విలేఖరులు ప్రభుదేవాను సంప్రదించగా...'నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ వెల్లడించాల్సిన అవసరం లేదు' అని స్పందించారు. నయనతారతో తన పెళ్లి వార్తను మాత్రం ఆయన ఖండించలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X