మెగాఫోన్ పట్టనున్న ప్రేయసి..డైరెక్ట్ చేయనున్న ప్రియుడు...?
ప్రభుదేవాతో ఎఫైర్ కారణంగా సినిమాలకు దూరమైపోయిన నయనతార, త్వరలో నిర్మాతగా అవతారమెత్తబోతోందట. తన అందం, అభినయంతో ప్రేక్షకజనాన్ని మంత్రముగ్దం చేస్తున్న కథానాయిక నయనతార ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతోంది. నిర్మాతగా మారి ఓ త్రిభాషా చిత్రాన్ని అభిమానులకు ప్రేక్షకులకు కానుకగా అందించడానికి రంగం సిద్దం చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో ఏకకాలంలో రూపొందే ఈ భారీ చిత్రాన్ని తన ప్రియసఖుడు ప్రభుదేవాతో కలిసి నిర్మించనున్నట్టు నయనతార ప్రకటించింది.
'అరుంధతి" స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలన్నది ఈ మలయాళీభామ అభిమతమట. మహిళా ప్రధాన్యతతో తెరకెక్కే ఈ చిత్రంలో మూడు భాషల్లోనూ నయన్ ప్రధానపాత్రను పోషిస్తుందిట. ఒకే దెబ్బకు మూడు పిట్టలు..అన్న చందాన ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన ఈ సినిమాతో తనేంటో నిరూపించుకొనే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











