ప్రభుదేవా, నయనతార అక్కడ దొరికిపోయారు
ప్రభుదేవా, నయనతార ప్రేమాయణానికి భార్య రమాలత్ కోర్టు ద్వారా నోటిస్ ఇప్పించి చెక్ చెప్పే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క నయనతారని పిలిచి పెద్దరికంగా రజనీకాంత్ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసారు. దాంతో వీరిద్దరూ కాస్త ఎడం ఎడంగా ఉంటూ ఎవరు పనిలో వారు ఉంటున్నారనుకున్నారు. అయితే ఈ ప్రేమజంట హఠాత్తుగా ప్యారిస్ లో దొరికిపోయి అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. ఇదెలా జరిగిందంటే.. జయం రవి, హన్సిక జంటగా ఎంగేయమ్ కాదల్ పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో తమిళంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ప్యారిస్‌లోనే చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వారాంతాల్లో ప్రభుదేవా హోటల్ రూమ్‌లో వుండలేదు. సోమవారం ఉదయం తిరిగి కనపడేది. దాంతో అసలు ఏం జరుగుతోందనే ఆసక్తితో సినిమా యూనిట్‌లోని కొందరు సభ్యులు ప్రభుదేవాను ఫాలో అవ్వగా ప్యారిస్‌లోని ఓ అందమైన లొకేషన్ లో ప్రభు, నయనతారలు జంటగా కనిపించారు. దాంతో ఈ విషయం ఇండియాకు మరుక్షణమే చేరిపోయింది.


Click it and Unblock the Notifications











