సెటిల్ మెంట్ గా ప్రభుదేవా తన భార్యకు ఎంత చెల్లించారు?
ప్రభుదేవా, వివాహానికి అడ్డంగా నిలిచిన అతని భార్య రమాలత ఎట్టకేలకు మ్యూచువల్ డైవర్స్ కు ఒప్పకుందనే సంగతి తెలిసిందే. అందు నిమిత్తం ఆమెకు ప్రభుదేవా 30 కోట్ల రూపాయలు వరకూ చెల్లించాడని తెలుస్తోంది. దాంతో గత ఆరునెలలుగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అయితే ఇది కాస్టలీ సెటెల్మెంటే అని చెప్తున్నారు. అయితే ముగ్గరు పిల్లలు ఉండటం వారు అన్యాయం అయిపోతారనే కోణంలో సబబే అంటున్నారు. అలాగే ఈ ముఫ్పై కోట్లు డబ్బు రూపంగా కాక చెన్నైలోని సీ సైడ్ విల్లా, త్రీ ప్లాట్స్, హైదరాబాద్ లో ఉన్న ప్రాపెర్టీ ఆమె పేర రాసేటట్లు ఎగ్రిమెంట్ చేసుకున్నారు. క్యాష్ రూపంలో పది లక్షలు రూపాయలు తక్షణమే చెల్లించనున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న ధరని బట్టే ఆ ఆస్దుల విలువ లెక్క కట్టారని, ఇది లాయర్ల సమక్షంలో ఓ పెద్ద నిర్మాత జోక్యంతో జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వివాదం ముగియటంతో త్వరలో వివాహం కానుందని నయనతార హ్యాపీగా ఉంది.


Click it and Unblock the Notifications











