Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నయనతార ‘ప్రేమికుడు’ ప్రభుదేవా సీక్వెల్..?
వెండితెరపై ఆకట్టుకున్న అనేకానేక ప్రేమకథలను మించి తెరవెనుక ప్రభుదేవా-నయనతార లవ్ స్టోరీ గత రెండు మూడేళ్లుగా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో ఆసక్తి కరమైన కథనం. అసలు వీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు... ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు... తన భార్య రమాలత్ కు ప్రభుదేవా విడాకులు ఇవ్వడం... ఇత్యాది అంశాలతో ఎప్పటికప్పుడు వీరి టాపిక్ హాట్ హాట్‌గానే నడిచింది. ఇటీవలే విడాకులు మంజూరైన నేపథ్యంలో మరో వారంలో ప్రభుదేవా, నయనల పెళ్లి అని, ఇంకో నెలరోజుల్లో పెళ్లి చేసుకుంటారని...ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ ప్రభుదేవా అలా జరగలేదు అందరికీ తెలసే చేసుకొంటామని ప్రకటించిన విషయం విధితమే...ఇలా ప్రభు-నయనల జీవితంలో రోజుకో మలుపు తిరుగుతోంది..ఇప్పుడు తాజాగా నయనతారతో ప్రేమికుడు సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి...
రజనీకాంత్ నటించిన 'రోబో" చిత్ర సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గతంలో ప్రభుదేవాతో చేసి ఎక్స్ పర్మెంటల్ మూవీ 'ప్రేమికుడు". కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సరసన అందాల భామ నగ్మాను హీరోయిన్ గా పెట్టి భారీ సాహసమే చేశాడు శంకర్. ప్రభుదేవా సూపర్బ్ డాన్సింగ్ పెర్ఫామెన్స్ కు తోడు... శంకర్ టేకింగ్ తోడై.. సినిమా సూపర్ హిట్టయింది.
గతంలో 'ప్రేమికుడు"గా తెరపై కనిపించిన ప్రభుదేవా నయనతారను ప్రేమించి నిజమైన 'ప్రేమికుడు"గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు త్వరలో తనతో వివాహానికి సిద్ధమైన నయనతారతో మళ్లీ 'ప్రేమికుడు" సినిమాకు సీక్వెల్ గా నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో హీరోహీరోన్లుగా ప్రభుదేవా, నయనతారలే నటిస్తారంటున్నారు. ఇక హిందీలో కూడా పాపులర్ అయిన ప్రభుదేవా ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడుభాషల్లో తీసే అవకాశం కనిపిస్తోంది.