నయనతారకు మతిపోగొడుతోన్న ప్రభుదేవా..!?

By Sindhu

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రంతో దర్శకుని అవతారం ఎత్తిన తమిళ హీరో, డ్యాన్సర్‌, గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ అర్థం కావటం లేదట. ముఖ్యంగా నయనతారకైతే మైండ్‌ పోతుందట. మొన్న ఆ మధ్య "ఇచ్" సినిమాలో నయనతార నటిస్తుందని అందరూ అనుకొన్నారు. అయితే ఆ చిత్రానికి నయనతారని వద్దని హన్సిక హీరోయిన్ గా సెలక్ట్ చేయడమే కాకుండా షూటింగ్ లో ఆటపాటలు నేర్పాడని అది ప్రేమేనని అందరూ గుసగుసలాడారు. అయితే ఇప్పుడేమో తమిళంలో ప్రభుదేవా దర్శకత్వంలో అతి త్వరలో మరో చిత్రం రాబోతుందని సమాచారం.

తెలుగులో గోపిచంద్, అనుష్క, నటించిన 'శౌర్యం" చిత్రాన్ని తమిళంలోని రీమేక్ చేయనున్నాడని ఈ చిత్రంలో తిరుపతి కుర్రాడు విశాల్‌ హీరోగా నటిస్తుంటే అతనికి జోడీగా నయనతార నటిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కూడా సడెన్‌ గా ఏమైందో ఏమోగానీ నయనతారకు బదులు త్రిషను తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుదేవా తన ప్రియారిటీస్ లో చాలా క్లియర్ గా ఉంటాడని, అతని పర్సనల్ లైఫ్ కి ప్రొఫిషినల్ లైఫ్ మిక్స్ చేయడం ఇష్టముండదు కనుకే ఇలా చేసుంటాడిని ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ విషయం తెలుసుకున్న నయనతార ప్రభుదేవా వ్యవహార శైలిపై మండిపడినట్లు భోగట్టా. నయనతార కోపాన్ని తెలుసుకున్న ప్రభుదేవా ఆమెకు ఐస్‌ పెట్టి తన దారికి తెచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద నయనతారను బ్రతిమాలి, బామాలీ త్రిషను తన ట్రాక్‌లోకి లాగుతున్నట్లు అనిపిస్తుంది కదూ ప్రభుదేవా వ్యవహరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X