Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ప్రభుదేవా..హిందీ రీమేక్ కు మరో మహేష్ బాబు సినిమా
మహేష్ బాబు..పోకిరి చిత్రాన్ని హిందీలోకి వాంటెడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టిన ప్రభుదేవా మరో మహేష్ ను హిందీలోకి అనువదించటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే మహేష్ కెరీర్ లో సంచలన విజయం సాధించిన ఒక్కడు. గుణశేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు నిర్మించారు. ఇప్పుడా చిత్రాన్ని అభిషేక్ బచ్చన్ హీరోగా చేయాలని ప్రభుదేవా సంకల్పించాడుట. ఈ మేరకు ప్రభుదేవా..అభిషేక్ ను కలసి కథ వినిపించాడని తెలుస్తోంది. బీహార్ బ్యాడ్ డ్రాప్ లో ఈ చిత్రం కథను నేరేట్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే నయనతార ను హీరోయిన్ గా తీసుకునేందుకు రికమెండ్ చేసారని చెన్నై వర్గాలు చెప్తున్నారు. ఇక అభిషేక్ ఈ స్టోరీ విని, సినిమా తెప్పించుకుని చూసి చాలా ఇంప్రసై అయ్యాడని అంటున్నారు. అయితే బల్క్ గా డేట్స్ కావాలని చెప్పటంతో కొంత టైమ్ కావాలన్నట్లు చెప్తున్నారు. అంటే మహేష్ సినిమాలు ప్రభుదేవాకు బాలీవుడ్ సక్సెస్ కు ఉపకరిస్తున్నాయన్నమాట.ఇక ఒక్కడు చిత్రం తమిళంలో గిల్లీ పేరుతో విజయ్ హీరోగా రూపొంది మంచి విజయం సాధించింది. అలాగే కన్నడంలోనూ అజయ్ పేరుతో రీమేక్ అయింది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసి సక్సెస్ సాధించాడు.