సూర్య 'వీడొక్కడే' హిందీ రీమేక్ డిటేల్స్

By Srikanya

చెన్నై: ఇప్పుడు హిందీలో రీమేక్ ల హవా నడుస్తోంది. తెలుగు పోకిరీ ని హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టి ఈ రీమేక్స్ ఊపు తెచ్చిన ప్రభుదేవా మరో రీమేక్ కు రంగం సిద్దం చేసారు. ఆయన తాజాగా సూర్య,కె.వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన వీడొక్కడే చిత్రాన్ని హిందీలోకి రైట్స్ చేయటానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం రైట్స్ ను కోటిన్నర రూపాయలకు ఎవియం వారి నుంచి టిప్స్ వారు తీసుకున్నారు. త్వరలోనే నటీనటులు ఎంపిక పూర్తయ్యాక ప్రకటన వస్తుంది.

పూర్తి యాక్షన్ తో నడిచే ఈ చిత్రంలో సూర్య సరసన తమన్నా నటించింది. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొన్ని మార్పులు చేసి ప్రభుదేవా హిందీ మార్కెట్ లోకి దింపనున్నారు. గతంలో ఈ చిత్రం హిందీలోకి విద్వంసక్..ది డిస్ట్రరాయర్ అనే టైటిల్ తో డబ్బింగ్ కూడా చేసారు. అయినా రీమేక్ చేస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం సూర్య హీరోగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కె.ఇ.జ్ఞానవేళ్ రాజా సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బెల్లంకొండ సురేష్, సాయిగణేష్ నిర్మాతలు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ 'దర్శకుడు కె.వి.ఆనంద్ నాకెంతో ఆప్తమివూతుడు. ఆయన దర్శకత్వంలో చేసిన 'ఆయన్' (తెలుగులో 'వీడొక్కడే') పెద్ద విజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నా కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రమవుతుంది' అన్నారు.

కె.వి.ఆనంద్ మాట్లాడుతూ 'వాణిజ్య అంశాలు మేళవించిన రియలిస్టిక్ చిత్రమిది. సూర్య అంటే నాకెంతో అభిమానం. ఈ సినిమా కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశాడు. హారీస్ జైరాజ్ సంగీతం సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది' అన్నారు. సమర్పకుడు జ్ఞానవేళ్ రాజా మాట్లాడుతూ 'సూర్య ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. మా సంస్థలో మరో ఉత్తమ చిత్రమవుతుంది' అన్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తున్నానని పీటర్ హెయిన్స్ అన్నారు. సూర్య, కె.వి.ఆనంద్ కలయికలో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా వుందని హీరోయిన్ కాజల్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X