భయానకంగా.... ప్రభుదేవా ‘మెర్క్యూరీ’ అఫీషియల్ ట్రైలర్

By Bojja Kumar

ప్రభుదేవా ప్రధాన పాత్రలో 'మెర్య్కూరీ' అనే సైలెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ భయానకంగా ఉంది. సినిమాలో ఎలాంటి మాటలు ఉండవు అయినా ప్రేక్షకులు భయం ఫీలయ్యేలా రూపొందించడమే దీని ప్రత్యేకత.

అప్పట్లో కమల్ హాసన్ హీరోగా సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో 'పుష్కక విమానం' అనే మూవీ సినిమా వచ్చింది. ఆ మూవీ భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చాలా ఏళ్ల తర్వాత అలాంటి డిఫరెంట్ కాన్సెప్టుతో 'మెర్య్కూరీ' రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి భాష లేదు. ఇందులో ఎలాంటి డైలాగులు ఉండవు. ఇదొక మూకీ సినిమా. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్‌తో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1992లో మెర్క్యూరీ విష ప్రభావం వల్ల 84 మంది చనిపోయారు... అనే ఓ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది.

ప్రభుదేవా, సనంత్, ఇంధుజా, దీపక్ పరమేష్, శశాంక్ పురుషోత్తమ్, అనిష్ పద్మనాభన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పెన్‌ మూవీస్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, జయంతిలాల్‌ గద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కార్తీక్ సుబ్బరాజు.

ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి భాష లేదు కాబట్టి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మరి దర్శకుడు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా ఎంటర్టెన్ చేయబోతున్నాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X